Breaking News

కాలినడకతో ప్రపంచాన్ని చుట్టి.. 28 ఏళ్ల తర్వాత తల్లి చెంతకి..

Published on Sat, 10/31/2026 - 14:13

ఒక్కసారి ఇంటి నుంచి బయల్దేరితే మళ్లీ 28 ఏళ్ల వరకు తిరిగి వెళ్లకపోవడం సాధ్యమేనా? అదీ వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తూ.. అడవులు, మంచుకొండలు, సముద్రాలను దాటుకుంటూ. ఓ వ్యక్తి ఇదే చేసి చూపించాడు. 29 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన సాహసయాత్ర ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడంతో ఇన్నేళ్ల తర్వాత సొంతింటికి చేరుకుంటున్న ఆయనకు ఆనందంతో పాటు మరికొన్ని సందేహాలు మదిలో మెదులుతున్నాయని అంటున్నాడు ఆ వ్యక్తి.

బ్రిటన్‌లోని హల్‌ (Hull) నగరానికి చెందిన మాజీ పారాట్రూపర్‌ కార్ల్‌ బుష్బీ (Karl Bushby) 1998లో తన 29 ఏళ్ల వయసులో ఈ సాహసయాత్రను మొదలుపెట్టాడు. అయితే చిలీలోని పుంటా అరెనాస్‌ (Punta Arenas) నుంచి తన సొంతూరు హల్‌ వరకు ఎక్కడా కూడా, ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించకుండా, నిరంతరాయంగా కాలినడకన చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణం పూర్తయ్యే వరకు బ్రిటన్‌కు తిరిగి వెళ్లకూడదని రెండు నియమాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. దాదాపు 36 వేల మైళ్లు (57,936 కిలోమీటర్లు) ప్రయాణించి నాలుగు ఖండాలను చుట్టేశారు.

అడవులు.. మంచుకొండలు.. సముద్రాలు!
ఈ సుదీర్ఘ ప్రయాణంలో డేరియన్‌ గ్యాప్‌ దట్టమైన అడవులను దాటి, గడ్డకట్టే బెరింగ్‌ జలసంధిని అధిగమించారు. ఇటీవలే ఇంగ్లిష్‌ కెనాల్‌ను ఈదుకుంటూ డోవర్‌ తీరానికి చేరుకున్నాడు. దీంతో ఇప్పుడు సొంతూరికి చేరుకోవడానికి కొద్ది మైళ్ల దూరమే మిగిలింది. అయితే ప్రయాణంలో సామగ్రిని తీసుకెళ్లే 'ది బీస్ట్‌' అనే హ్యాండ్‌కార్ట్‌ టైరు పంక్చర్‌ కావడం వంటి చిన్న సమస్యలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయిని కార్ల్‌ బుష్బీ తెలిపాడు.

28 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలయిక..
'నా రాక కోసం కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 36 ఏళ్ల కుమారుడు ఆడమ్‌, ఇప్పటివరకు కలుసుకోని 12 ఏళ్ల మనవరాలు, తండ్రి, సోదరులు స్వాగతం పలకనున్నారు. చిన్ననాటి ఇంటి వద్ద తల్లి ఎదురుచూస్తోంది. అయితే ఇన్నేళ్ల దూరం కుటుంబ బంధాలపై ప్రభావం చూపిందని' కార్ల్ తన మాటలతో‌ చెప్పుకొచ్చాడు. 'కుటుంబం ఎప్పుడూ మనదే. కానీ ఇన్నేళ్లు దూరంగా ఉండటంతో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది' అని భావోద్వేగానికి గురయ్యాడు కార్ల్‌ బుష్బీ.

యాత్ర ముగిస్తే.. నా జీవితమేంటి?
'ప్రయాణం పూర్తయిన తర్వాత ఇకపై నేను ఎవరు? ఇక నా జీవితానికి అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రతిరోజూ నా లక్ష్యం కోసమే బతికాను. ఇప్పుడు అది ముగిసిపోతుంది' ఇన్నేళ్లుగా తన గుర్తింపు మొత్తం ఈ ప్రయాణంతోనే ముడిపడి ఉందని కార్ల్‌ అంటున్నాడు.

అలాగే డోవర్‌ నుంచి ఆయనతో కలిసి నడిచిన అమెరికా పాదయాత్రికురాలు ఏంజెలా మ్యాక్స్‌వెల్‌ కూడా కార్ల్‌కు నడక కంటే ప్రయాణం వెనుక ఉన్న లక్ష్యం, పట్టుదలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సొంతింటికి చేరుకున్న అతను.. బ్రిటన్‌ సంప్రదాయ వంటకమైన ఫిష్‌ అండ్‌ చిప్స్‌ను కూడా ఆస్వాదించాడు.

ఈ ప్రయాణంలో ఎన్నో దేశాలు చూశానని, ఎంతోమంది మంచి మనుషులను కలిశానని కార్ల్‌ గుర్తుచేసుకుంటున్నాడు. మొదట్లో డబ్బులు లేక ఇతరులు ఇచ్చిన విరాళాలు, రోడ్డు పక్కన దొరికిన ఆహారంతో రోజులు గడిపానని చెబుతున్నాడు. వీసా సమస్యలు, కరోనా ఆంక్షలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రయాణం ఆలస్యమైందని వివరించాడు. 28 ఏళ్లలో సుమారు 15 ఏళ్లు మాత్రమే నడిచానని తెలిపాడు.

అయితే 'నాలో సాహస భావం ఇంకా అలాగే ఉంది, ముగిసేది ప్రయాణమే.. సాహస తపన కాదు! ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఊహించిన ఫలితాలకంటే ఎక్కువే సాధించవచ్చు, దీంతో యువతకు వారి జీవితంలో దొరికిన అవకాశాలను ఎప్పుడూ వదులుకోకూడదని, సమయం ఉన్నప్పుడే దానిని వినియోగించుకోవాలని' తన అభిప్రాయాన్ని పలువురికి తెలియజేశాడు కార్ల్‌ బుష్బీ.

ఇదీ చదవండి: డాగ్‌ ఫెస్టివల్‌: కుక్కకి ఓ రోజు వస్తుంది అంటే ఇదే..!

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)