Breaking News

అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?

Published on Wed, 12/03/2025 - 08:58

ఆ ప్రాంతంలో కాన్పు కోసం గర్భిణీని అంగడికి తీసుకువెళతారు. తీసుకెళ్లాల్సింది ఆస్పత్రికి కదా అంగడికి ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే...

కాన్పు జరగడంలో ఆలస్యం అయితే చాలు అక్కడ ముందు అంగడికి తీసుకువెళతారు. గర్భిణీ తన కొంగు జాపి కూరగాయలు అడుక్కుంటుంది. ఇంటికి వచ్చిన తరువాత ఆ కూరగాయలను వండుకునే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మంజీర నది పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాల్లో దశాబ్దాల కాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 

తొమ్మిది నెలలు నిండిన తరువాత కాన్పు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడడం సహజం. పూర్వ కాలంలో కాన్పు ఆలస్యం అవుతుందంటే చాలు దగ్గరలో జరిగే అంగడికి తీసుకువెళ్లేవారు. ఆమె వెంట తల్లీ, కుటుంబ సభ్యులు వెళ్లి గర్భిణి కొంగు పట్టుకుని ఐదు రకాల కూరగాయలు సేకరిస్తారు. కూరగాయలు అమ్మేవారు గర్భిణిని చూడగానే కూరగాయలు ఆమె కొంగులో వేసి దీవిస్తారు. 

తరువాత గర్భిణికి ఇష్టమైన పదార్థాలను తినిపిస్తారు. అంగడికి తీసుకువెళ్లడం మూలంగా గర్భిణికి శారీరక వ్యాయామం కలుగుతుంది. ఇంట్లో కూర్చుని కాన్పు కోసం పడే ఆందోళన కూడా తగ్గుతుంది, కాన్పు సులభంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ ఆచారం మొదలైంది అంటారు.

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బాన్సువాడ, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, జుక్కల్‌ తదితర మండలాలతో పాటు పొరుగున ఉన్న మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో గర్భిణులను అంగడికి తీసుకువెళ్లే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 
– ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి 

(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)