Breaking News

‘ఉల్లి’ కన్నీళ్లను తుడిచిన యువ ఇంజనీర్‌..! సరికొత్త ఆవిష్కరణ

Published on Fri, 10/02/2026 - 17:11

ఆమె అందిరిలా ఇంజనీర్‌ చేసి కార్పొరేట్‌ ఉద్యోగాల వైపుకి మళ్లకుండా..రైతులను ఆదుకునే దిశగా ఆడుగులు వేసింది. చిన్నప్పటి నుంచి ఉల్లి రైతుగా తండ్రి పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూసిన ఆమె..పెద్దయ్యాక ఎలాగైన తన ప్రతిభతో చెక్‌ పెట్టాలనుకుంది. అలా ఉల్లి నిల్వను సురక్షితంగా ఉంచుకునేలా స్మార్ట్‌ టచ్‌తో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికి అగ్రి-టెక్ (Agri-tech) సామాజిక పారిశ్రామికవేత్తగా అవతరించింది. 

ఆ అమ్మాయే కళ్యాణి షిండే. భారతదేశానికి చెందిన కళ్యాణి ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్‌గా పేరుగాంచిన మహారాష్ట్రలోని నాశిక్ జిల్లా, లాసల్‌గావ్‌కు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలోనే జన్మించింది. ఉల్లి పండించే కుటుంబం కావడంతో పంట కోత తర్వాత సరైన నిల్వ వసతులు లేక ఉల్లిపాయలు కుళ్ళిపోయి రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను చిన్నప్పటి నుంచే కళ్లారా చూసిందాము. 

అప్పుడే అనుకుంది ఈ సమస్యకు తను ఏదోవిధంగా చెక్‌పెట్టాలని అనుకునేది. ఆ నేపథ్యంలోనే ఆమె లాసల్‌గావ్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన అనంతరం 2018లో పూణే విశ్వవిద్యాలయం పరిధిలోని అమృత్‌వాహిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఐతే టెక్‌ ఉద్యోగాల వైపుకి వెళ్లకుండా చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న లక్ష్యం వైపుకే సాగింది. 

అలా ఆమె రైతుల సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో టీసీఎస్‌ ఫౌండేషన్‌ డిజిటల్‌ ఇంపాక్ట్‌ స్క్వేర్‌(డీఐఎస్‌) మద్దతుతో ఉల్లిపాయల నిల్వపై విస్తృత పరిశోధనలు చేశారు. నిజానికి సాంప్రదాయ గోదాములలో ఉల్లిపాయు కుళ్లిపోవడం చాలా ఆలస్యంగా తెలిసేది రైతులకు. అప్పటికే సగం పంట నాశనమైపోయేది. దీనికి పరిష్కారంగా గోడమ్ సైన్స్‌ అనే సరికొత్త ఐఓటీ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించింది కళ్యాణి. 

ఈ పరికరం గోదాములోని ఉష్ణోగ్రత, తేమ, ఉల్లిపాయలు కుళ్లిపోయేటప్పుడు విడుదలయ్యే వాయువులను నిరంతరం గమనిస్తుంది. నిల్వ ఉంచిన పంటలో కేవలం 1% నుంచి 2% మేర నష్టం ప్రారంభమైనా వెంటనే రైతులకు మొబైల్‌ అలర్ట్‌ మెసేజ్‌ పంపుతుందట. దీంతో రైతులు మిగిలిన పంట పాడవ్వకుండా తగు చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఈ సాంకేతికత వల్ల రైతులు ఉల్లిపాయ వృధాను 20% నుంచి 25% వరకు తగ్గించుకోగలగుతున్నారు. 

అందుకుగానూ కళ్యాణికి ప్రతిష్టాత్మకమైన యంగ్ చేంజ్ మేకర్ అవార్డు, మహానారీ, క్రిషితాన్‌ వంటి అవార్డులు వరించాయి. ప్రస్తుతం వందలాది గోదాములలో ఈ సాంకేతికతను వినియోగిస్తుండటం విశేషం. కాగా, కళ్యాణి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చి, రైతు పిల్లల్ని కూడా ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అని సగర్వంగా చెబుతోంది.

ఇదీ చదవండి: నెల జీతం రూ. 3 వేలు..కుమారుడి ప్యాకేజీ రూ. 1.2 కోట్లు! కంటతడి పెట్టించే స్టోరీ..

 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)