Breaking News

‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌

Published on Fri, 06/28/2024 - 12:26

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా,  డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రధానంగా  నాగ్‌ అశ్విన్‌ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్‌ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్‌ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. అలాగే  షూటింగ్‌ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా  పోస్ట్‌ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది.

ఏం చేసావ్ నాగ్ అశ్విన్?  అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని  పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్‌ ఇది అంటూ వైజయంతి మూవీస్‌ అండ్‌ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్‌ చేసిన  ప్రభాస్‌తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్‌ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.

 ఫరియా అబ్దుల్లా -కల్కి2898 ఏడీ లుక్‌

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా  దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)