Breaking News

ఏకంగా శున‌కాల‌కై.. అమెరికన్‌ కంపెనీ 'క‌డీ' పేరుతో..

Published on Sun, 06/02/2024 - 12:46

చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్‌ కంపెనీ ‘థింకో ఎల్‌ఎల్‌సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్‌ మంచానికి రూపకల్పన చేసింది.

దీని తయారీకి చైనీస్‌ కంపెనీ లావో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్‌ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్‌ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.

యాప్‌ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్‌ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్‌ బెడ్‌ను ‘థింకో ఎల్‌ఎల్‌సీ’ జూన్‌ నెలాఖరులోగా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

బీపీ చెకింగ్‌ స్మార్ట్‌వాచీలు..
జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్‌ చేయించుకోవాలంటే డాక్టర్‌ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్‌ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్‌ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే అమెరికన్‌ కంపెనీ వైహెచ్‌ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్‌ స్మార్ట్‌ వాచీని అందుబాటులోకి తెచ్చింది.

మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్‌ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!

ఇవి చ‌ద‌వండి: నిద్దుర‌లో బాగా గుర‌క కొడ్తున్నారా! అయితే ఈ దిండు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)