Breaking News

భగవద్గీత పఠనంలో గోల్డ్‌ మెడల్‌..!

Published on Mon, 04/07/2025 - 10:16

ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు. 

భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్‌లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్‌మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు.  

ఎనిమిది నెలలు శ్రమించా.. 
గత ఎనిమిది నెలలుగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్‌ మెడల్‌ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్‌లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను. 

(చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)