Breaking News

వారి సంఖ్య ఎందుకు తక్కువ?

Published on Wed, 04/16/2025 - 00:04

ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ ప్రకారం...
పోలీస్‌శాఖకు సంబంధించి జాతీయ స్థాయిలో కేవలం 8 శాతం మహిళా అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో 52 శాతం మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, 25 శాతం మంది ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
⇒  కానిస్టేబుల్‌ స్థాయిలో మహిళలు 13 శాతం ఉన్నారు. 

⇒ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపిఎస్‌) అధికారులలో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.
⇒ అత్యధికంగా మహిళా డిఎస్పీలతో (133) మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది.
⇒ ప్రస్తుతం 78 శాతం పోలిస్‌ స్టేషన్‌లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఉన్నాయి.
⇒ ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్రపాలితప్రాంతం కూడా పోలీసుశాఖలో మహిళల కోసం వారి స్వంత రిజర్వ్‌ కోటాను చేరుకోలేదు.

ఎందుకు ఇలా?
‘పోలీసు శాఖలో మహిళలప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి దీర్ఘకాలిక, సామాజిక, వ్యవస్థాగత వైకల్యాలే కారణం. పోలీసింగ్‌ అనేది పురుషులు, శారీరక బలం ఉన్న వారి వృత్తి మాత్రమే, సుదీర్ఘమైన పనిగంటలతో ముడిపడి ఉన్న ఉద్యోగం అనే లోతైన అబిప్రాయం చాలామందిలో ఉంది. కుటుంబం, సామాజిక ఆకాంక్షలు మహిళలు పోలీసు వృత్తిలోకి రాకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది’ అంటున్నారు మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ బేడీ.

వ్యవస్థాగత అవరోధాలను కూడా ఆమె ఎత్తి చూపారు.
‘చైల్డ్‌కేర్‌ ఫెసిలిటీస్, సేఫ్‌ వర్కింగ్‌ కండీషన్, జెండర్‌–సెన్సిటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొరత స్పష్టంగా ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని తగినంత రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు లేకపోవడం, పరిమిత మార్గదర్శకత్వం, కెరీర్‌ పురోగతి మందగించడం వంటి ఇతర సమస్యలు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ మౌలిక సమస్యలను పరిష్కరించకపోతే, పోలీస్‌ వృత్తిలోకి మహిళల ప్రవేశం పరిమితంగానే కొనసాగుతుంది’ అంటారు కిరణ్‌ బేడీ.

‘యూనిఫాం ధరించిన పురుష సిబ్బంది నుంచి మహిళా పోలీసులకు తగినంత సహకారం లభించడం లేదు’ అంటున్నారు కొందరు మహిళా పోలీసు అధికారులు.

నెమ్మదిగా అయినా సరే...
‘చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో మహిళలకు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిజర్వేషన్‌లు ఉన్నాయి. ఎక్కువమంది మహిళలను చేర్చుకోవడంలో వారంతా సీరియస్‌గా ఉన్నారు. నెమ్మదిగా మా సంఖ్య పెరుగుతోంది’ అంటారు మాజీ ఐపీఎస్‌ అధికారి మీరాన్‌ చద్దా.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)