ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..

Published on Fri, 06/05/2026 - 12:37

మనకెదురయ్యే సమస్యల నుంచే అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. బహుశా సమస్య కూడా సౌకర్యాలు సమకూర్చుకునేదే కాబోలు. ఇదంతా ఎందుకంటే..ఇక్కడ ఓ ఐదేళ్ల చిన్నారి తనలాంటి పిల్లలు పడుకోవడానికి ఇబ్బందిపడే నిద్ర సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపింది. పేరెంట్స్‌కి పిల్లలను నిద్రపుచ్చుడం ఓ సవాలులా ఉంటుంది. ఆ సమస్యకు ఈ చిన్నారి భలే అద్భుతంగా చెక్‌పెట్టడమే కాదు. ఆమె ఆవిష్కరణకు పేటెంట్‌ కూడా మంజూరవ్వడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..

ఇంతవరకు పిల్లల నిద్రపై ఏ ఆవిష్కరణ ప్రభావవంతంగా లేదు. పిల్లలు నిద్రపోవడం లేదంటూ డాక్టర్లు వద్దకు వెళ్లి మెడిసిన్‌ తెచ్చుకుని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా ఔషధల ప్రభావం లేకుండా సహజసిద్ధంగా వాళ్లను నిద్రపుచ్చే టెక్నీక్‌ కోసం పిల్లలు, నిపుణులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదోక పరిష్కారం కానీ సమస్యలా ఉన్న జఠిల సమస్యకు కాలిఫోర్నియాకు చెందిన ఐదేళ్ల చిన్నారి వెన్నెల అత్తిలి అద్భుతంగా చెక్‌ పెట్టింది. 

తన తల్లి వీపుపై జోకొడుతూ ఉంటే తనకు నిద్రపట్టేది లేదంటే నిద్రపట్టేది కాదామెకు. ఒక్కోసారి ఆమె తల్లి త్వరగా నిద్రపోయేది దాంతో తనకు నిద్రరాకి ఎలా ఇబ్బంది పడేదో బాగా తెలుసు. అయితే ఒక రోజు స్కూల్‌లో ఉపయోగకరమైన ఏదైనా వస్తువును కనిపెట్టమని ఇచ్చిన అసైన్‌మెంట్‌ ఆవిష్కరణకు దారితీసింది. అదేదో తాను రోజు ఎదుర్కొంటున్న నిద్రసమస్యకు చెక్‌పెడితే చాలని అనుకుంది వెన్నెల. 

అందుకోసం ఒక టెడ్డీబేర్‌, గుడ్డ, పుల్లలు, వైబ్రేటింగ్‌ మోటర్‌ని ఉపయోగించింది. ఆ బొమ్మ మన పక్కన ఉంటే మన తల్లిదండ్రులు ఉన్నట్లుగా శ్వాస, వెచ్చదనం ఇచ్చేదనం అందించే బొమ్మ అయ్యి ఉండాలని అనుకుంది. అలా ఆమె ‘హ్యాపీ స్లీప్’ అనే శ్వాస తీసుకుని వెచ్చదనం అందించే బొమ్మను రూపొందించింది. నిజానికి ఇంట్లో చాలామంది పిల్లలు పడుకునేటప్పుడు తమకు నచ్చిన ఏదోఒక బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోతుంటారు. ఆ బొమ్మతో పిల్లలకు భావోద్వేగపరమైన సంరక్షణతో కూడిన అనుబంధం ఉంటుంది. 

అలా వెన్నెల ఆవిష్కరించిన బొమ్మ నిజంగానే ప్రభావవంతంగా ఉంది. ఇది నిజంగా పిల్లలకు తమ పక్క సంరక్షకులు ఉన్నారనే భావంతో హాయిగా నిద్రపోయారు. పైగా అధ్యయనంలో మంచి ఫలితాలు లభించాయి. దాంతో ఈ ఆవిష్కరణను  2019 కాలిఫోర్నియా ఇన్వెన్షన్ కన్వెన్షన్‌లో ప్రదర్శించగా, అక్కడ ఆ చిన్నారి  మెరిట్ అవార్డును అందుకోవడమే కాకుండా యుఎస్‌ పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. కాగా, ఈ ఆవిష్కరణ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి లేదా ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉన్న వారికి సాంత్వన చేకూరుస్తుందని చెబుతోంది ఆ చిన్నారి. 

(చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!)
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)