Breaking News

Give blood..Give Hope : లేదంటే ప్రాణాలు పోతాయ్‌!

Published on Sat, 06/14/2025 - 13:06

World Blood Donor Day  ప్రతి ఏడాదికీ ఓ థీమ్‌ ఉన్నట్లే ఈ ఏడాది 2025 ప్రపంచ రక్తదాతల దినోత్సవ థీమ్‌‘‘రక్తమివ్వండి... నమ్మకం ఇవ్వండి (గివ్‌ బ్లడ్‌... గివ్‌ హోప్‌ (Give blood..Give Hope) అని. దీని అర్థం ఏమిటంటే... ‘రక్తం మనందరిలోనూ ఉండే మనందరినీ కలుపుతుంది. రక్తదానం చేయడం ద్వారా సాటి మనిషి ప్రాణాలకు మనం విలువ ఇస్తున్నామనీ, ఆపదలో ఉన్నవారి  ప్రాణాల్ని కా పాడటానికి మేం సంసిద్ధమనే సందేశం ద్వారా తోటివారిలో నమ్మకం పెంచాలన్నదే ఈ ఏడాది థీమ్‌. మనందరినీ మానవులుగా కలిపేది మన రక్తమే. బ్లడ్‌ డొనేషన్‌ ద్వారా రక్తాన్ని ఇస్తే తోటివారికి నమ్మకాన్ని ఇచ్చినట్టే... వాళ్ల ప్రాణానికి మన  ప్రాణాన్ని అడ్డు వేస్తామన్న భరోసాని నింపినట్టే అన్నది ఈ ఏడాది థీమ్‌ ఆంతర్యం. 

కాంపోనెంట్లుగా విడదీసిన  రక్తంతో ప్రయోజనాలివే... 
ఒక వ్యక్తి నుంచి సేకరించిన మొత్తం రక్తాన్ని అంటే హోల్‌ బ్లడ్‌ను ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లు వంటివి... ఎవరికైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి ఎక్కిస్తే... అప్పటికి అతడికి అవసరం లేని కాంపోనెంట్స్‌ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అయితే బాధితులకు నిర్దిష్టంగా రక్తంలోని ఏ అంశం కావాలో దాన్నే (అదే కాం΄పోనెంట్‌ను) ఎక్కించే ఆధునిక పరిజ్ఞానం, సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి  ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్‌ ఆర్‌బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగీలాంటి వ్యాధి సోకి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్‌బ్లడ్‌ను వివిధ అవసరాలు ఉన్న వారికి ఎక్కించి ఒకరికంటే ఎక్కువమందికి ఒకే రక్తం ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కం΄ోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేయడం చాలా మంచిది.

సేకరణ ఇలా... 
దాతల నుంచి రక్తం సేకరణ కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాలలోని దాదాపు అన్ని ముఖ్యమైన ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ (ఐఆర్‌సీఎస్‌), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా , ప్లేట్‌లెట్స్‌ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్‌ సపరేషన్‌ యూనిట్లు’ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపోనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్‌బ్యాంకులే ఎక్కువ. కాబట్టి మనం దానం చేసిన రక్తం పలువురికి ఉపయోగపడాలనుకునేవారు ‘కాం΄ోనెంట్‌ సపరేషన్‌ యూనిట్లు’ ఉన్న రక్తనిధుల్లో రక్తదానం చేయడం మరింత మేలు చేసే అంశం. పలువురికి ఉపయోగపడే విషయం. మానవ దేహంలో  ప్రాణం  నిలవడానికి అవసరమైన నిరంతర ప్రవాహమే రక్తం. మొదటి కణాలకు తాజా రక్తం అందించాక... జీవక్రియల తర్వాత మలిన వ్యర్థాలను తగిన వ్యవస్థల ద్వారా విసర్జింపజేస్తూ... మళ్లీ తాజా రక్తంలోపోషకాలూ, ఆక్సిజన్‌ నింపి... ఈ సైకిల్‌ నిరంతరం కొనసాగేలా చేస్తుండే ప్రధానమైన అంశం రక్తం. ఆ రక్తం కాసేపు అందకపోతే కీలకమైన మెదడు కణం నుంచి మామూలు దేహ కణం వరకు ఏదైనా చనిపోతుంది. 

ఇదీ చదవండి : AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్‌

ఇంతటి ఈ కీలకమైన  రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు. ప్రమాదాల్లో గాయపడ్డవారిని రక్షించేందుకు వారికి అవసరమైన రక్తాన్ని అందించి భర్తీ చేయడం అవసరం. అలా భర్తీ చేయడం కోసం దాతలు స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వడమూ అవసరం. ఇలా రక్తదానం  ప్రాధాన్యాన్ని తెలియజెప్పడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ జూన్‌ 14ను ‘‘స్వచ్ఛంద రక్తదాన దినం’గా నిర్వహిస్తుంటారు. 

రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. రక్తదానం చేసే వ్యక్తులు  బలహీనమైపోరన్నది ఓ ప్రధానమైన అపోహ. ఇది ఏమాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడినుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యరకమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓమారు రక్తదానం చేయవచ్చు. 18–60 ఏళ్ల మధ్యనున్న ఆరోగ్యకరమైన వ్యక్తులు ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు. అందుకే ఈ ఏడాది థీమ్‌ ప్రకారం రక్తదానాన్నిప్రోత్సహిస్తూ... ‘‘రక్తమివ్వండీ... మానవతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నింపండి’’.

చదవండి: Air India Plane Crash: కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!

రక్త సంబంధం చివరగా... 
చాలా సందర్భాల్లో అవసరమైనంత రక్తం ఉండదు. అంటే రక్తానికి ఉండే  డిమాండ్‌ కంటే సప్లై చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా ఒక ఆఫీసు నుంచి గానీ లేదా ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కార్యాలయంలోని ఔత్సాహికులుగానీ రక్తాన్ని దానం చేయదలచుకుంటే అందరూ ఒకేసారి రక్తదానం చేయడం కంటే... దశల వారీగా రోజుకు కొంతమంది చొప్పున రక్తదానం చేస్తుండటం మంచిది. దీనివల్ల రక్త సరఫరా మరీ ఎక్కువగా కాకుండానూ, మరీ తగ్గకుండా కాన్‌స్టాంట్‌గా అందుతూ ఉంటుంది. మన వద్ద ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్‌ స్ట్రెంగ్త్‌) ఆధారంగా కూడా రక్తం డిమాండ్‌ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని  ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయినా ఇప్పటికి దొరుకుతున్నది కేవలం 75 శాతమే. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసుల్లో 70% మరణాలు కేవలం రక్తం అందకపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులు, మంచి పేరున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన రక్తనిధులకు, అందునా రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రాలకు (బ్లడ్‌బ్యాంకులకు) రక్తదానం చేయాలన్నది నిపుణులు ఇస్తున్న పిలుపు.

డాక్టర్‌ ఎ. గౌతమ్‌ మెడికల్‌ అండ్‌ హిమటో ఆంకాలజిస్ట్‌ 

 

– యాసీన్‌

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)