Breaking News

5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌

Published on Tue, 04/22/2025 - 16:11

సినీ నటులు సెలబ్రిటీలను  ఈ మధ్య కాలంలో తమ శరీర బరువును తగ్గించుకుంటున్నారు.   పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని  మార్చుకోవడం లాంటి సాహసాలతోపాటు, నిజజీవితంలో ఫిట్‌గా  ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు,  తీవ్ర కసరత్తుల  ద్వారా స్లిమ్‌గా తయారవుతున్నారు. ముఖ్యంగా బాగా బరువు తగ్గి వార్తల్లో నిలిచిన వారిలో  విద్యాబాలన్‌, ఖుష్బూ, జ్యోతిక లాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాగే బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహార్‌ కూడా ఇటీవలి కాలంలో బాగా బరువుతగ్గి  బక్కచిక్కినట్టు కనిపించారు. అయితే కరణ్‌ జోహార్‌ ఓజెంపిక్‌ లాంటి ఇంజక్షన్లు తీసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి. వాటిని కరణ్‌  తీవ్రంగా ఖండించారు. ఆహార మార్పులు, జీవన శైలి మార్పుల ద్వారానే బరువు తగ్గానని స్పష్టం చేశారు. ఇపుడు ఈ కోవలో టాలీవుడ్‌ హీరో జూ.ఎన్‌టీఆర్‌ వార్తల్లో నిలిచాడు.  అయితే కఠినమైన డైట్‌తో తన రాబోయే చిత్రం  ‘డ్రాగన్’ కోసం భారీగా బరువుగా తగ్గడం విశేషంగా నిలిచింది.

అలనాటి  అందాలహీరో దివంగత నందమూరి  తారక రామారావు  వారసుడిగా సినిమాల్లో వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ‘బాల రామాయణం’ సినిమాలో  బాలనటుడిగా అద్భుతమైన నటనతో తానేంటో నిరూపించుకున్నాడు.  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ హీరోగా  తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత రాఖీ, ఆది లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమాల్లో బొద్దుగా కనిపించి. ఉన్నట్టుంటి ఎన్టీఆర్‌ స్మార్ట్‌గా, సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అటు అభిమానులను, ఇటు విమర్శలను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అప్పటినుంచి అదే బాడీని మెయింటైన్‌ చేస్తూ  వస్తున్నాడు. తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.  డ్రాగన్‌ మూవీకోసం ఇంత బరువు  అంటే..5 నెలల్లో 18 కిలోలు తగ్గాడట. ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడలేదని,  ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లుక్ కోసమే తారక్‌ బాగా డైటింగ్‌ చేశాడని అతని టీం స్పష్టం చేసింది. వ్యాయామం, కఠినమైన ఆహారం ఫలితంగా అతని లుక్‌లో మార్పు అని వెల్లడించింది. నేటి (ఏప్రిల్ 22) నుంచి ప్రశాంత్ నీల్‌ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. సముద్ర తీరంవద్ద దగ్గర జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్  ఉన్న అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఈ మూవీపై మరింత  ఆసక్తి రేగింది. ఈ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తుండగా, నిర్మాతలు ఇప్పటివరకు ఇతర తారాగణం సాంకేతిక సిబ్బంది వివరాలను గోప్యంగా ఉంచారు.


ఓజెంపిక్‌ ఇంజెక్షన్లు
అయితే గతంలో బరువు తగ్గినపుడు లైపోసక్షన్‌  చేయించుకున్నాడనే పుకార్లు జోరుగా వినిపించాయి. తాజగా ఎన్టీఆర్‌ బరువు తగ్గడంపై కూడా సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్న ఓజెంపిక్‌ ఇంజెక్షన్‌ తీసుకున్నాడని వదంతులు వ్యాపించాయి. అయితే తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని,  తిండి మానేస్తే చాలు ఎవరైనా వెయిట్ తగ్గొచ్చు  అని గతంలోనే స్పష్టం చేశాడు. అయితే  తన పాత్ర కోసం బాడీని మార్చుకోవడం ఎ న్టీఆర్‌కు కొత్తేమీ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కొమరం భీమ్‌  పాత్ర  కోసం సెలబ్రిటీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి, ఐదు నెలల్లో 18 కిలోలు  బరువు తగ్గిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రోజుకు మూడు గంటలు వ్యాయామం, కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌, హై-ప్రోటీన్, జీరో-ఫ్యాట్ డైట్  ఇందులో భాగం.  

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)