Breaking News

జాలరి కానుక..

Published on Sun, 08/11/2024 - 03:20

బుర్హాన్‌పురం జమీందారు భువనచంద్ర. అతని పుట్టినరోజు విందుకు ప్రజలందరినీ పిలిచేవాడు. కొందరు పెంచుకునే కోడినో, బాతునో జమీందారుకు కానుకగా ఇచ్చేవారు. బుర్హాన్‌పురంలోనే సైదులు అనే పేద జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వల తీసుకుని చెరువుకు పోయి చేపలు పట్టేవాడు. తాటాకు బుట్ట నిండాక వాటిని సంతలో అమ్మి జీవించేవాడు. ప్రతిఏడు జమీందారు పుట్టిన రోజుకు పెద్ద చేపను కానుకగా ఇచ్చేవాడు. ఎప్పటిలా ఆ సంవత్సరమూ భువనచంద్ర పుట్టినరోజు వచ్చింది. ఈసారి మరింత పెద్ద చేపను పట్టి జమీందారుకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సైదులు. తాటాకు బుట్ట, వల తీసుకుని చెరువుకు పోయాడు. చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.

ఆ ఏడు వానలు సరిగా పడలేదు. వరుణుడు కరుణిస్తేనే జాలరి నోట్లోకి బువ్వ పోయేది. చెరువులో వల విసిరాడు. కొద్దిసేపటికి వల బరువెక్కింది. వలలో పెద్ద చేపే చిక్కిందని ఆశతో వలను లాగి ఒడ్డుకు తెచ్చి దులిపాడు. చేప చిక్కలేదు కానీ.. తాబేలు వలలో చిక్కింది. తాబేలు తన డిప్పలోంచి తల బయటకి పెట్టి చూసి, చెరువు వైపు అడుగులు వేసింది. చేప చిక్కనందుకు నిరాశ చెందాడు సైదులు. ఒక్క నిమిషం ఆలోచించి, తాబేలును పట్టుకుని తాటాకు బుట్టలో వేసుకున్నాడు. పేదవాడైన సైదులు వద్ద  జమీందారుకు కానుకగా ఇవ్వటానికి ఏమీలేదు. చేసేది లేక తాబేలునే కొత్త బుట్టలో వెంట తీసుకెళ్లాడు. జమీందారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, పాదాలకు దండం పెట్టి బుట్టను కానుకగా ఇచ్చాడు. ఎప్పటిలా పెద్ద చేపనే తెచ్చాడనుకుని తెరచి చూశాడు భువనచంద్ర. కానీ బుట్టలో తాబేలును చూసి ఆశ్చర్యపోయాడు.

‘అయ్యా! క్షమించండి. ఎప్పటిలా పెద్ద చేపనే పట్టి తెద్దామనుకున్నాను. కానీ వర్షాలు లేక చెరువు ఎండిపోయింది. చేపలు లేవు’ అని చెప్పాడు సైదులు దిగులుగా.
‘అలాగా! మరి నీకు ఎలా గడుస్తోంది సైదులు?’ అడిగాడు జమీందారు.

‘చేపలు దొరికిన నాడు నోట్లోకి బువ్వ! దొరకని నాడు పస్తులే! అలవాటైపోయిందయ్యా’ అన్నాడు సైదులు. భువనచంద్ర ఒక్క క్షణం ఆచించించి ‘ఇంట్లో పెంచుకోటానికి, పూజించటానికి తాబేలును పట్టి తెమ్మని నేనే కబురు పెడదామనుకున్నాను. ఇంతలో నువ్వే కానుకగా ఇచ్చావు. చాలా సంతోషం!’ అన్నాడు. విందు చేసి ఇంటికి పోతున్న సైదులుకు చిన్న సంచి నిండా ధనసాయం చేశాడు.

నాటి నుంచి తాబేలును పెంచుకోసాగాడు జమీందారు. అంతేకాదు బుర్హాన్‌పురం అంతటా వృక్షాలు నరకటం నిషేధించి, కొత్త మొక్కలను నాటించాడు. వచ్చే ఏటికల్లా.. వర్షాలు పడి చెరువులు నిండాయి.  రాంకీ

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)