Breaking News

ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?

Published on Wed, 10/23/2024 - 10:19

‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్‌.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు. 

ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్‌’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్‌వీర్‌ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్‌గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్‌ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్‌ నితిన్‌  ముఖేశ్‌లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.

అక్టోబర్‌ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్‌ షమానీకి ఇచ్చిన పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్‌ నటిగా వెలిగిపోతున్న పరిణీతి.  

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)