Breaking News

ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!

Published on Thu, 04/24/2025 - 14:54

సాక్షి, సిటీబ్యూరో:  హైదరాబాద్‌ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది. 

ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్‌ జ్యువెలరీ పెర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్‌లో ట్రెండ్‌ సెట్టింగ్‌ డిజైన్లు, బ్రాండ్‌ లాంచ్‌లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్‌ ఆఫ్‌ యంగ్, లెజెండ్స్‌ ఆఫ్‌ సౌత్, జ్యువెలరీ పర్చేజ్‌ మేనేజర్స్‌ కనెక్ట్, కాఫీ విత్‌ డాక్టర్‌ చేతన్, బిజినెస్‌ మ్యాచ్‌ మేకింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం 
దక్షిణాదిలోని హైదరాబాద్‌ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్‌ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్‌ జ్యువెలరీ పెర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్‌ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్,  ప్రత్యేక బ్రాండ్‌ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ జ్యువెలరీ పెర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ దేశంలోని ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్‌తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్‌ వ్యాపారులను ఏకం చేస్తున్నాం.  

– యోగేష్‌ ముద్రాస్, భారత 
ఇన్ఫార్మా మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. వచ్చే నెలలో హైదరాబాద్‌ జ్యువెలరీ పెర్ల్, జెమ్‌ ఫెయిర్‌  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌