Breaking News

డైరెక్టర్‌ని పొట్టన పెట్టుకున్న జాండిస్‌? ఎందుకు వస్తుంది? లక్షణాలు

Published on Mon, 03/11/2024 - 16:46

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్‌  అకాలమరణం విషాదాన్ని నింపింది.  ప్రాథమిక  సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా  తదితర వివరాలను తెలుసుకుందాం.

పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది.  మన శరీరంలోని లివర్‌ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్‌ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం  కావచ్చు.

ఈ  కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్‌ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి.

లక్షణాలు 
♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం,
♦  శరీరం పసుపు పచ్చ కలర్‌లోకి మారిపోతుంది.  కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. 
♦  కడుపులో మంట ,కడుపు నొప్పి
♦  ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో  బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది.
♦  చలి, జ్వరం 
♦  రక్తపు వాంతులు

మద్యపానం,  ఇతర కారణలు
కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్‌ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు 

కామెర్ల వ్యాధిని నిర్ల‌క్ష్యంచేస్తే ర‌క్త‌పు వాంతుల‌తోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం

నోట్‌: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)