రామాయణ చిత్రం తర్వాత ట్రెండ్‌ అవుతున్న ప్రదేశం ఏదో తెలుసా?

Published on Mon, 11/23/2026 - 09:26

ఇటీవల రామాయణ సినిమా విడుదల అయిన తరువాత ట్రెండ్‌ అవుతున్న ప్రదేశాల్లో కేరళలోని జటాయు ఎర్త్‌ సెంటర్‌ కూడా ఒకటి. రీల్స్‌ లో, ఇన్‌ స్టా లో ఈ రాతి పక్షి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

అతిపెద్ద పక్షి శిల్పం

కేరళలోని కొల్లం జిల్లా చడయమంగళం కొండపైనే ఈ సెంటర్‌ ఉంది. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం అంటారు. రామాయణంలో సీతమ్మను కాపాడటానికి రావణుడితో పోరాడి గాయపడి జటాయువు ఇక్కడే పడ్డారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ కొండకు జటాయుపారా అని కూడా పేరు.

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మామూలు విగ్రహం కాదు. ఒక కొండను చెక్కి చేసిన శిల్పం. 200 అడుగుల ΄÷డవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో 1000 అడుగుల ఎత్తున్న కొండపై కూర్చున్నట్టు ఉంటుంది.

ప్రముఖ శిల్పి, ఫిల్మ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ అంచల్‌ 10 ఏళ్లు కష్టపడి దీన్ని నిర్మించారు. బయట నుంచి చూస్తే గాయపడిన జటాయు రెక్క, ముక్కు, గోళ్లు ప్రతి డీటెయిల్‌ కనిపిస్తుంది. లోపల సిక్స్‌ డి థియేటర్, మ్యూజియం ఉన్నాయి.

ఈ కొండపై నుంచి చూస్తే చుట్టూ పచ్చని అడవులు, కొల్లం నగరం కనిపిస్తాయి. అందుకే దీన్ని లెజెండ్‌ మీట్స్‌ ఆర్ట్‌ అంటారు.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి తిరువనంతపురానికి ఫ్లైట్‌లో కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి చడయమంగళం వరకు క్యాబ్‌ లో 1 గంట 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. కొండ కింద నుంచి పైకి వెళ్లడానికి కేబుల్‌ కార్‌ ఉంది. నడవాలనుకుంటే 826 మెట్లు ఎక్కాలి. బడ్జెట్‌ లో వెళ్లాలంటే శబరి ఎక్స్‌ ప్రెస్‌ లో కొల్లం వరకు వెళ్లి బస్సులో వెళ్లవచ్చు.

ఇదీ చదవండి: శివుడి త్రిశూలంపై.. నిలిచిన నగరం!

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)