Breaking News

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published on Thu, 03/06/2025 - 15:52

దివంగత టాలీవుడ్‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్‌ హీరో ఎన్‌టీఆర్‌ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్‌ పరంగా తన తల్లికి ఏమాత్ర​ం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్‌ మెయింటైన్‌ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.

జాన్వీ తరుచుగా తన ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్‌ సీక్రెట్‌ తదితరాల గురించి షేర్‌ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్‌ చికెన్‌, పాలకూర, సూప్‌ తీసుకుంటానని చెబుతోంది. 

ఎక్కువగా జపనీస్‌, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్‌ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్‌ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్‌ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్‌ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. 

చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్‌ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. 

ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్‌. గ్లామర్‌ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్‌ తీసుకోకపోతే కష్టమే కదూ..!.

(చదవండి: కోచింగ్‌ లేకుండానే నీట్‌లో 720కి 720 మార్కులు..!)
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)