Breaking News

పండగ వేళ గుడ్‌ న్యూస్‌ : 100 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు, ఎక్కడ?

Published on Sat, 08/09/2025 - 15:02

ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు..ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి. ఇలాంటి స్థితిలో జాక్‌పాట్‌ లాంటి వార్త. లక్షల టన్నుల బంగారంతో నిండిన భూమి గర్భంలో దాగి ఉన్న నిధి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎక్కడ చూసినా సంతోషం వెల్లివిరిస్తోంది.  ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని భూగర్భ శాస్త్ర, ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ? ఎలా? ఏంటి? తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కదా.. పదండి  తెలుసుకుందాం.

100 హెక్టార్ల బంగారం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్ధారించింది. ఒకటి రెండూ కాదు  ఏకంగా 100 హెక్టార్ల నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను నిర్వహించి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి , ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని  గుర్తించింది.   దీనికి GSI అనేక పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాడలను వెల్లడించింది. బంగారు నిక్షేపాలు లక్షల టన్నుల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఇటీవలి కాలంలో  భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఖనిజ ఆవిష్కరణలలో ఇదొకటి అని అధికారులు భావిస్తున్నారు.

ఇదే తొలిసారి కాదు
మధ్యప్రదేశ్‌లో బంగారం కనుగొనబడటం ఇదే మొదటిసారి కాదు.  కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న కట్ని జిల్లాలో బంగారు నిక్షేపాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికి అధికారిక ధృవీకరణ లేదు. అయితే, జబల్పూర్ అన్వేషణ  రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. ఖనిజాలతో నిండిన సంపన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు, శాంపిల్ టెస్టింగ్, లాబ్ అనాలసిస్, ఈ ప్రాంతంలో ఉన్న బంగారం నిక్షేపాలు వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలమని నిర్ధారించాయి కూడా. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనులనుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి , సిలిసియా ఇసుకను వెలికితీస్తున్నారు. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)