Breaking News

'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్‌ ఫిట్‌నెస్‌ మంత్ర..!

Published on Mon, 11/18/2024 - 16:24

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్‌ విమెన్‌. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్‌ ఫిజిక్‌ని మెయింటైన్‌ చేసేందుకు ఎలాంటి వర్కౌట్‌లు చేస్తుంటుందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్‌లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.

చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్‌ వంటి వర్కౌట్‌లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్‌లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది. 

మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, హింగ్‌లు, పుష్‌-పుల్‌ అప్స్‌ వంటి వర్కౌట్‌లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్‌లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్‌ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్‌ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు. 

తాను రొటీన్‌ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్‌చేంజర్‌లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా  క్రమతప్పకుండా వర్కౌట్‌లు చేస్తే మంచి ఫిట్‌నెస్‌ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్‌గా ఉండమని కోరింది ఇవాంక.

 

(చదవండి: బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్‌! బాల్యం భారంగా మారకూడదంటే..)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)