Breaking News

భోజనం చేసి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? పక్షవాతం వస్తుందట!

Published on Tue, 06/27/2023 - 13:36

శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. 

కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి
► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి
► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. 
► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట.
► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. 
► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట.
► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు.
► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్‌ వంటి సమస్యలకు దారితీస్తాయి.

ఏ సమయంలో నిద్రపోతే మంచిది
మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)