Breaking News

థైరాయిడ్‌ ఉంటే అన్నం తినకూడదా?

Published on Mon, 02/26/2024 - 07:13

థెరాయిడ్‌ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్‌ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్‌ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!.

కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్‌ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్‌రైస్‌ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్‌రైస్‌ తీసుకోమని సూచిస్తున్నారు. 

బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.  ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి,  థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా  కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు. 

నిపుణులు ఏమంటున్నారంటే..

  • థెరాయిడ్‌ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే  థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
  • బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు.
  • ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్‌ రైస్‌కి ప్రిఫెరెన్స్‌ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్‌ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్‌ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు. 

అన్నాన్ని ఎలా వండి తినాలి? 
అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. 

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది. 

(చదవండి: రెడ్‌లైట్‌ థెరఫీతో షుగర్‌ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)