Breaking News

Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!

Published on Sun, 05/11/2025 - 09:22

చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్‌ వాచ్‌ ఉన్న వాడు కాదు రిచ్‌కిడ్‌ అంటే, ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో బర్గర్‌ తిన్నవాడే నిజమైన రిచ్‌కిడ్‌. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్‌ వంటకం) రూ. 2,180. 

అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్‌ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్‌ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్‌ వింగ్‌ ఫ్రైస్‌ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్‌ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్‌ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. 

అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్‌ బాటిల్‌ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్‌ లోన్‌ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్‌ అయ్యారనుకోండి, మీ బ్యాగ్‌ జాగ్రత్త! 

ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టు నంబర్‌ వన్‌ అని తాజా అధ్యయనంలో తేలింది.  ఈ ఎయిర్‌ పోర్టులో ఫ్లైట్‌ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్‌ అయిపోతున్నాయని ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టు బాధితులు సోషల్‌ మీడియాలో లబోదిబో మంటున్నారు.

(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్‌ ఇండియన్‌ గైడ్‌ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)
  

#

Tags : 1

Videos

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!