Breaking News

నమస్కారం.. వందేమాతరం

Published on Thu, 07/31/2025 - 15:25

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్నో ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (నైసార్‌) ఉప గ్రహానికి చైత్ర రావు (Chaitra Rao) అనే మహిళా శాస్త్రవేత్త శాటిలైట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ప్రయోగం విజయవంతమయ్యాక మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నమస్కారం.. అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. చివరలో వందేమాతరం.. అని చెప్పడంతో ఆందరూ ఆమెను తెలుగు మహిళా శాస్త్రవేత్త అనుకున్నారు. అయితే ఆమె మూలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రమే (Telugu State) అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారు. 

చిన్నపాటి ఇంజినీర్‌గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఉపగ్రహాలను రూపొందించడం, సమగ్ర పరచడం, పరీక్షించడం వంటి విభాగాల్లో ఆమె సైంటిస్టుగా పని చేస్తున్నారు. గతంలో మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌కు స్పేస్‌ క్రాఫ్ట్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఖగోళ పరిశోధనకు తయారు చేసిన ఆస్ట్రోశాట్‌లో పేలోడ్స్‌ను అందజేయడంలో కీలక భూమిక పోషించారు.

చ‌ద‌వండి: చిన్నోడి డాన్స్‌కు ఫిదాకు అవుతున్నారు!

ప్రస్తుతం నైసార్‌ ఉపగ్రహానికి శాటిలైట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అమెరికా­లోని కాలిఫోర్నియా ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీ (జేపీఎల్‌)కి చెందిన ప్రతినిధులతో కలిసి ఆమె ఈ ఉప­గ్రహాన్ని రూపొందించారు. ఇందులో ఎల్‌– బ్యాండ్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ను జేపీఎల్‌ ప్రతినిధులు, ఎస్‌–బ్యాండ్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ను ఇస్రో రూపొందించింది. చైత్రరావు శాటిలైట్‌ డైరెక్టర్‌గా కీలకమైన పాత్ర పోషించారు. పురుషులకంటే మహిళలు ఎందు­లోనూ తక్కువ కారని నిరూపించారు.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)