Breaking News

మనల్ని మనం బేరీజు వేసుకుందాం!

Published on Thu, 07/09/2026 - 10:01

జీవితం అంటే కేవలం సంపదను పోగుచేసుకోవడమేనా? మన వెనుక ఎన్ని భవనాలు, ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. మనం వెళ్లేటప్పుడు మనతో పాటు ఏమున్నాయన్నదే అసలైన ప్రశ్న. భౌతికమైన ఆస్తులు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసిన పరోపకారం, మనం పంచిన ప్రేమ మనల్ని అమరత్వం వైపు నడిపిస్తాయి.

మార్పు మన నుంచే మొదలు కావాలి
మనం చేసే చిన్నపాటి మంచి పని వల్ల ప్రపంచం మొత్తం మారుతుందా? అనే సందేహం రావచ్చు. సముద్ర తీరంలో ఒక వ్యక్తి వేల స్టార్‌ఫిష్‌లను కాపాడలేక పోయినా, తాను చేత్తో విసిరిన ఒక్కో ప్రాణి ప్రాణాన్ని కాపాడి తృప్తి చెందాడు. ‘దీని వల్ల పెద్ద మార్పు ఏమీ ఉండదు కదా?‘ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘కనీసం ఆ ఒక్కదాని జీవితంలోనైతే మార్పు వచ్చింది కదా!‘ అన్న సమాధానం అత్యంత శక్తిమంతమైనది.

మనం చేసే ప్రతి చిరు సాయం, పక్కవారికి మనం అందించే చిరునవ్వు.. ఇవన్నీ అల్లాహ్‌ దృష్టిలో గొప్ప సత్కార్యాలే. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లు, ‘ఏ సత్కార్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి.’ నిరంతరత అల్లాహ్‌కు అత్యంత ఇష్టమైనవి ఏమిటి? అంటే, భారీ పనులు కాదు.. మనం చేసే పనులలో నిరంతరత ఉండాలి. ‘కొద్దిగానైనా సరే నిరంతరం చేసే పనులు‘ భారంలా అనిపించవు, అవి మన ఆత్మకు శాంతిని కలిగిస్తాయి.

మన ఆస్తిపాస్తులు మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టవచ్చు, కానీ మనం చేసిన సత్కార్యాలు మాత్రమే మనల్ని గమ్యం వైపు నడిపిస్తాయి. తీర్పు రోజున మన సంపద లెక్కలు అడగబడవు, మనం చేసిన పనుల ఫలితాలే మన స్వర్గానికి సోపానాలు అవుతాయి. కాబట్టి, ఆ ధనవంతుడిలా చివరలో బాధపడకుండా, ప్రతిరోజూ మన చేతనైనంత మంచిని చేద్దాం. మనకు అందిన ప్రతి అవకాశాన్ని ఒక సత్కార్యంగా మలుచుకుందాం. అణువంత మేలు కూడా వృథా పోదు. రేపటికోసం నేటి నుండే సత్కార్యాల బాటలో పయనిద్దాం.

‘అనా ఫకీర్‌’ – ఆ వృద్ధుడి పశ్చాత్తాపం
ఒక ధనవంతుడు తన జీవితమంతా భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్‌ల కోసమే వెచ్చించాడు. కానీ, మరణశయ్యపై ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. తన పిల్లలు ఆస్తి పత్రాలు చూపిస్తున్నా, అతను ‘అనా ఫకీర్‌‘ (నేను పేదవాడిని) అని రోదించాడు. ఎందుకంటే, అక్కడ సంపద కొరత లేదు, అతను దేవుడి దరికి చేరడానికి కావలసిన ‘సత్కార్యాల సంపద’ కొరత ఉంది. జీవితం చివరలో మనం మిగుల్చుకోవాల్సింది ఆస్తులు కాదు, పరలోకానికి అవసరమైన పుణ్యకార్యాలు అని ఆ వృద్ధుడి వేదన మనకు గుర్తుచేస్తోంది. ఖురాన్‌ చెబుతున్నట్లుగా: ‘కావున, ఎవడైతే అణువంత మేలు చేస్తాడో, వాడు దానిని (దాని ప్రతిఫలాన్ని) చూస్తాడు.‘ (99:7)
– ముహమ్మద్‌ ముజాహిద్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)