Breaking News

ఏ ధర్మం ఎలా చెప్పినా..అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్లమే!

Published on Thu, 08/14/2025 - 13:12

పుడమిపై శ్వాస పీలుస్తున్న ప్రతి  ప్రాణీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని ముగించాల్సిందే. పుట్టిన ప్రతి  ప్రాణికీ మరణం తప్పదు. ఇది నగ్నసత్యం. తిరస్కరించలేని నిజం. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. ‘కుల్లునఫ్సిన్‌ జాయిఖతుల్‌ మౌత్‌ ’ అని పవిత్ర ఖురాన్‌ చెప్పింది. ‘జాతస్య మరణం ధ్రువం’ అని వేదం చెప్పింది. ఏ ధర్మం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా అర్థం అదే. కాని మనం దీన్ని పట్టించుకోం. మన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మరణిస్తూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, వారిని సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికూడా వేస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకువెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నారు.

కనీసం పార్థివ శరీరంపై ఉన్న బట్టలు, ఆభరణాలు కూడా ఇక్కడే వదిలేసి, ఆత్మీయులతో బంధాలను సైతం తెంచుకొని ఈలోకాన్ని వీడివెళ్ళి΄ోతున్నారు. తమవెంట భూములు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఏవీ తీసుకొని వెళ్ళడంలేదు. ప్రాణప్రదంగా ప్రేమించే భార్యాబిడ్డలు కూడా వెంట వెళ్ళడంలేదు. అంటే ఇవేవీ ఆ రోజు పనికి రావన్నమాట.

ముహమ్మద్‌ ప్రవక్త ఒక మాట చెప్పారు. ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తమూ మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం ఆలోచించకుండా, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళి΄ోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.

కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, వంచించి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయ విలువలకే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవ ప్రదంగా సాగి΄ోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. 
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

#

Tags : 1

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)