Breaking News

వజ్రాలు, వైఢూర్యాలతో డిజైన్‌ చేసిన జాకెట్‌..ధర ఏకంగా..!

Published on Thu, 03/07/2024 - 12:35

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి.  ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్‌లో లగ్జరీయస్‌గా జరిగింది. ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్‌ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్‌' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్‌ ప్రతి ఒక్కరిని స్టన్‌ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్‌ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్‌. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్‌ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్‌ చేసింది ప్రముఖ డిజైనర్‌ అబూ జానీ సందీప్‌ ఖోస్లా. ఆ బ్లౌజ్‌లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది.

డిజైనర్‌ సందీప్‌ 2012లో 'ఇండియ ఫెంటాస్టిక్‌"లో ప్రదర్శించిన ఐకానిక్‌ బ్లౌజ్‌లను తలదన్నేలా ఐషా ధరించిన బ్లౌజ్‌ని తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్‌పై ఇంత బరువైన నగలను చాల పొదినిగ్గా అమర్చడమే కాకుండా చూసేందుకు బండగా కనిపించకుండా ఎలా బ్లౌజ్‌పీస్‌పై అమర్చారా? అనిపించేలా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్‌ డిజైన్‌ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అయితే అంతలా ఖరీదైన వజ్రాలు, కెంపులు, రత్నాలతో రూపొందిన బ్లౌజ్‌ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్‌నే తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా. ఆ అత్యంత లగ్జరీయస్‌ జాకెట్‌ డిజైన్‌ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట్‌ పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్‌ లైక్‌లు వచ్చాయి. 

(చదవండి: షాపు షట్టర్‌లో కోటు చిక్కుకుపోడంతో పాపం ఆ మహిళ..!)
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)