Breaking News

నిద్రలో తేడాలొచ్చినా టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు

Published on Sun, 07/28/2024 - 13:30

టైప్‌ 2 డయాబెటిస్‌  ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం  విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందట.

మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక  పాత్ర పోషిస్తుంది. అయితే  సమయా పాలన పాటించని నిద్రకూడా  ప్రమాదమే అంటున్నారు.  హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని  తాజా పరిశోధన  ద్వారా తెలుస్తోంది.  ఈ పరిశోధన ప్రకారం  తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది.  అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్‌ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.

జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్‌ కేర్‌లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్‌ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్‌ వాచ్‌) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది. 

క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి,  ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు,  కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్‌ ఫోన్‌ల వంటి డిజిటల్‌ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్‌ ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని  ఆందోళన వ్యక్తమవుతోంది.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)