Breaking News

క్యాషియర్‌ టు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌

Published on Wed, 10/08/2025 - 10:00

సినిమాలో ప్రొడక్షన్‌ విభాగంలో క్యాషియర్‌గా మొదలైన ప్రస్థానం.. చివరకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్థాయికి చేరుకుంది.. హ్యాపీడేస్‌ సినిమాతో మొదలై.. క్రమంగా శేఖర్‌ కమ్ములతో ప్రయాణం సాగించారు. అలా ఆవకాయ బిర్యానీ సినిమాకు పనిచేశారు. ఈ క్రమంలో తన హార్డ్‌ వర్క్‌ నచ్చి శేఖర్‌ కమ్ముల మెచ్చుకున్నారు. తర్వాత లీడర్‌ సినిమాకు టీంలో చేరమని కబురు పంపారు. ఇదే ఆయన జీవితంలో కీలక మైలు రాయని, తెరవెనుక తాను పడిన కష్టమే తనను అనేక మెట్లు ఎక్కించిందని చెబుతున్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఇర్ల నాగేశ్వర్‌రావు.  

పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా మాచవరంలోనే. పిడుగురాళ్లలో ఇంటరీ్మడియట్, నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఓ కన్సల్టింగ్‌ కంపెనీ ద్వారా హైదరాబాద్‌ చేరారు. దగ్గుబాటి రానా నటించిన లీడర్‌ సినిమాకు శేఖర్‌ కమ్ముల టీంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యారు. అలా క్లాప్‌ కొట్టడం, తర్వాత ఆర్టిస్టులను కో–ఆర్డినేషన్‌ చేయడం. అగ్ర నటులు గొల్లపూడి మారుతి రావు, నటి సుహాసిని, నటుడు హర్షవర్ధన్, హీరోయిన్‌ ప్రియా, కోట శ్రీనివాసరావు వంటి వారికి దగ్గరయ్యారు.  

వివిధ విభాగాల్లో.. 
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్‌ నిమిత్తం లొకేషన్స్‌ కోసం క్రమంగా ఫిదా సినిమాకు ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. తర్వాత లవ్‌ స్టోరీ సినిమాకూ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో పని నచ్చడంతో శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ ప్రొడక్షన్స్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అయ్యారు. 

కుబేర విజయంలోనూ లొకేషన్స్‌ పరంగా కీలకపాత్ర పోషించారు. ‘నేను జీవితంలో మంచి చెడు పంచుకునే మొదటి వ్యక్తి శేఖర్‌ గారు. ఆయనతో నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా’ అని చెబుతున్నారు నాగేశ్వర్‌రావు. ప్రస్తుతం అమిగోస్‌ ప్రొడక్షన్‌ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.   

(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్‌ డ్రా చేయలేకపోతున్నాను..!)

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)