Breaking News

సమ్మర్‌లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!

Published on Fri, 04/11/2025 - 11:25

తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్‌’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్‌ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ట్రైన్‌ నెంబర్‌ 12734లో  సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది. 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్‌’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్‌ ఇన్‌ అవుతారు. బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు. 

ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్‌ నెంబర్‌ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది. 

ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్‌ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్‌ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. 

కేటగిరీ వారిగా ధరలు..

సింగిల్‌ షేరింగ్‌:  

3(ఏసీ):  రూ.6790లు  స్టాండర్డ్‌(ఎస్‌ఎల్‌): రూ.4940లు

ట్విన్‌ షేరింగ్‌

3(ఏసీ):  రూ.5660లు   స్టాండర్డ్‌(ఎస్‌ఎల్‌): రూ.3800లు

త్రిపుల్‌ షేరింగ్‌

3(ఏసీ):  రూ.5660లు   స్టాండర్డ్‌(ఎస్‌ఎల్‌): రూ.3800లు

పిల్లలకు బెడ్‌(5 నుంచి 11 ఏళ్లు)

3(ఏసీ):  రూ.4750ల       స్టాండర్డ్‌(ఎస్‌ఎల్‌): రూ.2890లు   

పిల్లలకు బెడ్‌ లేకుండా

3(ఏసీ):  రూ.4750ల       స్టాండర్డ్‌(ఎస్‌ఎల్‌): రూ.2890లు   

(చదవండి:




 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)