Breaking News

ఐపీఎల్‌ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?

Published on Mon, 11/25/2024 - 15:04

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఫ్యాషన్‌ స్టైల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను  ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్‌ -2025 వేలం సందర్భంగా మరోసారి  తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ  నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి  అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్‌ ధర కూడా హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

ఐపీఎల్‌ టీం ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్‌, బ్లూ సూట్‌లో హుందాగా కనిపించారు.  నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ  బ్రేజర్ సూట్  ధర  అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు.   ఇందులో బ్లేజర్‌ రూ. 47 వేలు కాగా  వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్‌ ధర రూ.78 వేలు.  అంతేనా వజ్రాలు పొదిగిన  ఎంఐ బ్రూచ్‌, హ్యాండ్‌బ్యాగ్,  డైమండ్‌ రింగ్‌, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్‌  ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం.

nbsp;

ఐపీఎల్ మెగా వేలం-2025  తొలి రౌండ్‌ విడత ప్రక్రియ  దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్‌ స్టార్లు  రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు   టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు  దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ కూడా పాల్గొన్నారు.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)