Breaking News

నెట్టింట సంచలనంగా మోడల్‌ తమన్నా, జాన్వీకి షాక్‌!

Published on Wed, 04/02/2025 - 16:14

లక్మే ఫ్యాషన్ వీక్ 2025లో  అందమైన  మోడల్స్‌,  బాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్లు  సందడి చేశారు. ముఖ్యంగా జాన్వీ కపూర్   (Janhvi Kapoor) స్ట్రాప్‍లెస్, థై స్లిట్ బ్లాక్ గౌన్‌లో గ్లామర్ ట్రీట్ అందించిది.  రాహుల్ మిశ్రా  డిజైన్‌ చేసిన అదిరిపోయే డ్రెస్ ధరించి ర్యాంప్‍పై వయ్యారంగా వాక్ చేయడం అభిమానులు ఫిదా కావడం తెలిసిందే. అయితే తాజాగా జాన్వీ కపూర్‌ మించిన స్టైల్‌తో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది మరో మోడల్‌. ఎవరబ్బా? తెలుసుకుందాం ఈ కథనంలో..


లక్మే ఫ్యాషన్ వీక్ 2025 (Lakme Fashion Week)లో జాన్వీ కపూర్ వెనుక నడిచిన మోడల్ తమన్నా కటోచ్ (Tamanna Katoch). ఆమె స్టైల్‌, ర్యాంప్‌ వ్యాక్‌ చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు.  అయితే ఇదే ఈవెంట్లో  జాన్వీ కపూర్  గౌన్‍పై క్లాత్ తీసిన విధానంపై కొందరికి నచ్చలేదు. నడక, స్టైల్ స్టేట్‌మెంట్‌ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. పైగా డబుల్ సైడెడ్ టేప్ బయటకు కనిపించిందంటూ కొందరు ట్రోల్ కూడా చేశారు కూడా.  ఈ నేపథ్యంలో ఆమె వెనుకాలనే నడిచిన తమన్నా లేటెస్ట్‌ సెన్సేషన్‌గా మారింది. తమన్నా కటోచ్ తన సూపర్ మోడల్ ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.  షోస్టాపర్  జాన్వితో పోలిస్తే  తమన్నానే షోస్టాపర్ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

బ్లాక్‌ హాల్టర్‌నెక్ గౌనులో మెరిసిసోతున్న  వీడియోను  తమన్నా కటోచ్  ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. తన లుక్ కి మరింత అందంగా తెచ్చేలా టై-అప్ హీల్స్ ని ఎంచుకుంది. అలాగే స్మోకీ ఐషాడో మేకప్‌,  టై-అప్ హెయిర్‌స్టైల్‌తో అదిరిపోయింది. ఈగ్లింప్స్‌ను విడుదల చేసిన వెంటనే, నెటిజన్లు ఆమెను అభినందనల్లో  ముంచెత్తారు. ‘‘జాన్వీని  ఎవ్వరూ చూడలేదు.. నిన్నే చూశారు..’’,  "లైన్ సెకండ్ సే షురు హోతీ హై" అని , "మీ నడకలో ఫైర్‌ ఉంది! అంటూ యూజర్ల కమెంట్లు వెల్లువెత్తాయి.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)