Breaking News

London: మహిళలు ఇల్లే కాదు.. సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకం!

Published on Sat, 03/16/2024 - 08:25

'ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, తోడుగా నిలబడితే 11 అని చాటుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవాస మహిళలు 'తెలుగు లేడీస్ ఇన్ యూకే' అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు'.

ఈ ‘తెలుగు లేడీస్ యూకే (UK)’ గ్రూపును శ్రీమతి శ్రీదేవి మీనావల్లి డిసెంబర్ 2011న ప్రారంభించారు. ఈ టీఎల్‌యూకే (TLUK) గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్కు వలస వచ్చే తెలుగు ఆడపడుచుల అందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల ద్వారా చేయూతను అందించడమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అని శ్రీదేవి గారు తెలిపారు.

ప్రతి సంవత్సరంలా కాకుండా వినూత్నంగా ఈ ఏటా సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేట్ క్రూయిజ్ లో ఈ వేడుకలు జరుపుకున్నారు.
థేమ్స్ నదిపై నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తూ విందు వినోదాలతో ,ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఉల్లాసంగా గడిపారు.

ఆట పాటలతో పాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్యా వైద్య సేవా కార్యక్రమాల్లో తోడ్పడి మహిళలందరూ తమ చేయూతను అందించారు. మహిళలు ఇల్లే కాదు సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ ఈవెంట్‌లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)