Breaking News

International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!

Published on Fri, 06/21/2024 - 08:59

యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్‌ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్‌తో తయారైన యోగా వేర్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్‌లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.

– కాటన్‌ స్మోక్డ్‌ వెయిస్ట్‌ క్రాప్‌ టాప్‌ బాటమ్‌గా బ్లాక్‌ హారమ్‌ ప్యాంట్‌ ధరించడంతో క్రీడాకారిణి లుక్‌ వచ్చేస్తుంది.
– ఆర్గానిక్‌ కాటన్‌తో డిజైన్‌ చేసిన ప్రింటెడ్‌ క్రాప్‌ టాప్, హారమ్‌ ప్యాంట్‌ ఇది.
– మిడ్‌ లెంగ్త్‌ స్లీవ్స్‌ కాటన్‌ టాప్, సైడ్‌ పాకెట్స్‌ ఉన్న కాటన్‌ ప్యాంట్‌తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.
– కాటన్‌ షార్ట్‌ కుర్తీ లేదా క్రాప్‌ టాప్స్‌ని ధోతీ ప్యాంట్‌తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.
– కాటన్‌ బెల్టెడ్‌ టాప్‌కి, పెన్సిల్‌ కట్‌ ప్యాంట్‌ యోగావేర్‌లో స్మార్ట్‌ లుక్‌తో ఆకట్టుకుంటుంది.
– యోగా వేర్‌లో జంప్‌సూట్‌ డిజైన్స్‌ సౌకర్యాన్ని ఇస్తాయి.

పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్‌ డిజైన్స్‌ని మెరుగుపరచవచ్చు.

  • యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్‌నీ కలపవచ్చు.

  • లేత రంగులు, ప్లెయిన్‌గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.

  • నడుము దగ్గర కాటన్‌ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్‌ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.

  • యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్‌గానే కనిపిస్తాం.

  • శరీర కదలికలకు తగినట్టు డ్రెస్‌ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.

  • స్టైల్‌గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్‌ ప్యాంట్స్, ర్యాప్‌టాప్‌ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి.  హైవెయిస్ట్‌ లెగ్గింగ్స్, క్రాప్‌టాప్స్, స్పోర్ట్స్‌ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

  • హెయిర్‌ హెడ్‌ బ్యాండ్స్, సన్నని బ్రాస్‌లెట్స్, స్టడ్స్‌ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.

  • పార్క్‌ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్‌ కాటన్‌ లేదా రీ సైకిల్‌ చేసిన బ్యాగ్‌లో యోగాకు ఉపయోగించే మ్యాట్‌ను, వాటర్‌ బాటిల్‌నూ వెంట తీసుకెళ్లవచ్చు.

  • యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)