Breaking News

ఇదో నిజాయితీ పెట్టె కథ!

Published on Fri, 07/25/2025 - 12:58

పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్‌బుక్స్‌ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి.  

నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి 
ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.

టీచర్‌ విన్నూత్న ఆలోచనతో సాకారం 
ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్‌ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్‌ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.

పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది 
మా స్కూల్‌లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్‌కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది.  – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థిని

మొక్కై వంగనిది మానై వంగునా.. 
చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా..  – తులసీనాథం నాయుడు, టీచర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)