Breaking News

ఆధ్యాత్మి కథ : శాశ్వతానంద్రప్రాప్తి..

Published on Mon, 06/01/2026 - 08:01

దశరథ మహారాజు ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కౌసల్యాదేవి పరిపూర్ణ దివ్యత్వంతో ఉట్టిపడుతున్న శ్రీరామునికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఒక చెలికత్తె వెళ్లి దశరథ మహారాజుకు విన్నవించగా ఆయన పట్టలేని ఆనందంతో ఎంతో విలువైన ఒక రత్నాల హారాన్ని ఆమెకు కానుకగా అందించబోయాడు. అప్పుడా చెలికత్తె, ‘మహారాజా! నాకు ఇవేవీ వద్దు. నేను కోరుకునేది ఒకటి ఉంది. 

ఇప్పుడు జన్మించిన బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించే భాగ్యాన్ని నాకివ్వండి, చాలు’ అన్నది. సామాన్యురాలైన ఒక చెలికత్తె ఎంతటి ఉత్కృష్టమైన కోరిక కోరుకుందో! ఒక్కొక్కరి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైన పవిత్ర భావాలు వారిలో ఆవిర్భవిస్తుంటాయి.
అరణ్యవాసానికి బయల్దేరిన సీతారామలక్ష్మణులు గంగానదిని దాటవలసి వచ్చింది. పడవ నడిపే గుహుడు, ‘ప్రభూ! నేను మిమ్మల్ని ఈ నది దాటిస్తాను. అందుకు ప్రతిఫలంగా నన్ను ఈ భవసాగరం దాటించాలి‘ అని రెండు చేతులు జోడించి అభ్యర్థించాడు. గుహుడు చదివిన చదువు ఏపాటిది! అతను కనబరచిన ఆధ్యాత్మిక పరిణతి ఎంత మహోన్నతమైనది!?

ధ్రువుడు ఎలాగైనా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది తన తండ్రి తొడపై కూర్చోవాలన్న కోరికతో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి సాక్షాత్కరించి ఏం కావాలని అడుగగా ఆ పసివాడు. ‘స్వామీ ఈ దట్టమైన అడవిలో నేను తపస్సు చేస్తున్న సంగతి తెలిసిన మీకు నా మనసులోని కోరిక తెలియదా?’ అంటాడు.

‘మనసులో ఉన్నది మాటలో వ్యక్తం చేయనిదే పరమివ్వడానికి వీలుకాద’ని విష్ణుమూర్తి వివరించగా, ‘స్వామీ నేను గాజు పెంకుకోసం వెతుకుతూ వస్తే నాకు అమూల్యమైన పజ్రమే లభించింది. మీ దర్శన భాగ్యం పొందిన నాకు ఇక తాత్కాలిక సంతోషాన్నిచ్చే రాజ్యాలు, భోగభాగ్యాలు అక్కర్లేదు. శాశ్వతానందాన్నిచ్చే మీ సాయుజ్యమే కావాల’ని కోరాడు. రాజ్యసుఖాలతోపాటూ పరమపదాన్ని కూడా ధ్రువునికి అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు.

భక్త ధ్రువునివలె శాశ్వతానంద్రపాప్తిని కోరుకుందాం. గుహునివలె భవసాగరాన్ని దాటించవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం. ఆ చెలికత్తెలా దైవసన్నిధిని ఒక పెన్నిధిగా భావించుకుందాం. – తరిగొప్పుల వీఎల్లెన్‌ మూర్తి 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)