Breaking News

ఛేంజ్‌ మేకర్స్‌ 2025

Published on Tue, 12/30/2025 - 06:42

→ డయానా పుండోల్‌
32 ఏళ్ల ఈ ఇద్దరు పిల్లల తల్లి మోటార్‌ రేసింగ్‌లో మొదటి మహిళా జాతీయ ఛాంపియన్‌. ఆమె 2024లో ఎంఆర్‌ఎఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్నారు. పురుషులు–ఆధిపత్యం వహించే ఈ క్రీడలో స్త్రీల నుంచి ఇదో పెద్ద ముందడుగు. ఇప్పుడు 2025–2026 ఫెరారీ క్లబ్‌ ఛాలెంజ్‌ మిడిల్‌ ఈస్ట్‌ సిరీస్‌లో ΄ోటీ పడుతున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు, ఫెరారీ 296 ఛాలెంజ్‌ కారును నడుపుతున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఇప్పుడు రేసింగ్‌లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

→ అంజ్లీ అగర్వాల్‌
డాక్టర్‌ అంజ్లీ అగర్వాల్‌కు జీవితంలో ఎదురైన లోతైన బాధలెన్నో తెలుసు. కండరాల బలహీనతతో చక్రాల కుర్చీలో జీవిస్తున్నారామె. బహిరంగ స్థలాల్లో ర్యాంప్‌ లేక΄ోవడం వల్ల  అవస్థ పడుతున్న తనలాంటి వేలమంది దివ్యాంగుల కోసం ఆమె ΄ోరాటం సాగిస్తున్నారు. ఆమె, ఆమె బృందం కలిసి వందలాది ప్రజా స్థలాలకు పునః రూపకల్పన చేశారు. ర్యాంప్‌ ఉండటం వల్ల దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులకు అవగాహన కల్పించారు.

→ బీబీ జాన్‌ 
కర్నాటకకు చెందిన బీబీ జాన్‌ చిన్నపాటి లోన్‌ కోసం బ్యాంక్‌ వెళితే తనలాంటి వాళ్లకు లోన్‌ రావడం ఎంత కష్టమో తెలియడమే కాకుండా తనలాంటి వాళ్లు చాలామంది లోన్ల కోసం బాధలు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆమె  స్థానిక స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి 14 మంది సభ్యుల బృందంతో మొదలుపెట్టి నేడు 1,000 మందికి పైగా మహిళల సమష్టి ఎదుగుదలకు కారణమయ్యారు. వారంతా స్వంత మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నడుపుతూ 
సేంద్రీయ, వాతావరణ–స్థిరమైన పద్ధతులను ఉపయోగించి 30 గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నారు.

 

#

Tags : 1

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)