Breaking News

నాట్యమయూరి

Published on Sun, 06/08/2025 - 04:02

నాట్యం నేర్చుకోవడానికి ఇంట్లో అనుమతి మొదలు ప్రతి ఒక్క దశలోనూ పరీక్షలు ఎదురయ్యాయి ఆమెకు. ఆఖరుకు నాట్యం చేస్తుండగానే వేదిక మీద ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వరకు. కాలికి గాయమైందని గజ్జెలను పక్కన పెట్టి కుంగిపోలేదామె. సర్జరీ చేయించుకున్నారు. 

నడక వరకు ఓకే కానీ క్లాసికల్‌ డాన్స్ చేయడం కష్టం అని తెలిసిపోయింది. రెండో సర్జరీతో మోకాలి కదలికలు మెరుగయ్యాయి. ఇనుమడించిన ఉత్సాహంతో తిరిగి నాట్యం చేస్తున్నారామె. ఇది మయూరి సినిమా కాదు. ఆమె సుధాచంద్రన్  కాదు. తెలంగాణ, కొత్తగూడెంలో పుట్టి పెరిగిన క్రాంతి నారాయణ జీవితం.

‘‘నడవడం వచ్చినప్పటి నుంచి పిచ్చి గంతులేస్తూ ఉండేదాన్ని. నా ఆసక్లిని గమనించిన మా అమ్మ... నాన్నను ఒప్పించి నన్ను డాన్స్‌ క్లాసులకు పంపించింది. నాట్యప్రదర్శనల కోసం ఇతర ఊర్లకు ఆడపిల్లను పంపించడం ఏమిటంటూ ఏడాదిలోపే అంతరాయం. నాన్నకు హైదరాబాద్‌కు బదలీ కావడంతో నాలోని నాట్యమయూరికి రెక్కలొచ్చాయి. 

దాదాపుగా అదే సమయంలో ఒక టీవీ షోలో శోభానాయుడి గారి ఇంటర్వ్యూ చూశాను. వృత్తి– ప్రవృత్తిని సమన్వయం చేసుకోగలిగిన నైపుణ్యం గురించి చక్కగా చె ప్పారామె. నేను వెళ్లగానే ఆమె ‘ఇన్నేళ్ల విరామం తర్వాత ఇక నాట్యసాధన అసాధ్యం’ అనడంతో కళ్లనీళ్లపర్యంతం అయ్యాను. అప్పుడు ఒక వారం రోజులు టెస్ట్‌ పీరియడ్‌గా వచ్చి ప్రాక్టీస్‌ చేయమన్నారు. ఆ పరీక్షలో నెగ్గి ఆమె శిష్యురాలినయ్యాను.

ఇంజినీరింగ్‌– కూచిపూడి
ఉస్మానియాలో ఇంజినీరింగ్‌ చేస్తూ కాలేజ్‌ నుంచి నేరుగా డాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఎంబీఏ కూడా అలాగే చేశాను. మహీంద్రా అండ్‌ మహీంద్రాలో ఉద్యోగం చేస్తూ కూడా డాన్స్ ప్రాక్టీస్‌ కంటిన్యూ చేశాను. ఆ సమయంలో మరో పరీక్ష ముంబయికి ట్రాన్స్ఫర్‌. నాన్న హైదరాబాద్‌ బదలీ నాకు డాన్స్ ప్రాక్టీస్‌కి అవకాశం ఇచ్చింది. నా ముంబయి బదలీ డాన్స్ కోసం ఉద్యోగం వదులుకునేటట్లు చేసింది. నాట్యానికే అంకితం కావాలనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామానికి వెళ్లి మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ చేశాను.

డాన్స్‌ను గౌరవించే వ్యక్తినే...
నా జీవితంలో నాట్యానికి ఉన్న ప్రముఖ స్థానానికి అద్దం పట్టేది నా పెళ్లి చూపులే. పెళ్లి తర్వాత నాట్యసాధన మానేయాలన్న వాళ్లను వద్దని, డాన్్సను గౌరవించే వ్యక్తినే నా జీవితంలోకి స్వాగతించాను. ఇప్పుడు చెప్పండి... కాలికి గాయమైందని నాట్యసాధన మానేయగలనా? నాట్యం ఆగిపోతే నాకు శ్వాస ఆగిపోయినట్లే. కరోనా విరామ సమయాన్ని మా గురువుగారి నాట్యరీతుల మీద ఎం.ఫిల్‌ చేయడానికి ఉపయోగించుకున్నా’’నని చె ప్పారు క్రాంతి నారాయణ. ఐదు వందలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఆ మధురానుభూతులివన్నీ అంటూ గది నిండుగా ఉన్న జ్ఞాపికలను చూపించారు. 

– వాకా మంజులారెడ్డి, 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)