Breaking News

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ కావాలి.. ఓ రెండు రూపాయలు ప్లీజ్‌-‘బ్యూటీ క్వీన్‌’

Published on Sat, 09/27/2025 - 15:08

విలాసవంతమైన ఐ ఫోన్‌ అంటే అందరికీ మోజే. అందులోనూ ఇటీవల అధునాతన ఫీచర్ల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్‌ చేసింది యాపిల్‌. దీంతో యాపిల్‌ లవర్స్‌లో మరింత క్రేజ్‌ పెరిగింది. దీనికోసం ఎగబడి, ఘర్షణకు దిగిన వీడియోలు కూడా నెట్టింట హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందు. ఎలాగైనా  ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను (iphone 17pro max) దక్కించుకునేందుకు  కొన్ని అసాధారణ మార్గాలను ఎంచు కుంటున్నారు. తాజాగా దానం చేయండి ప్లీజ్‌.. అంటూ ఆన్‌లైన్‌లో అడుక్కుంటున్న  ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌ (బ్యూటీ క్వీన్‌) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో చూద్దా రండి!

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్త, 'బ్యూటీ క్వీన్' మహి సింగ్ తన అనుచరులను QR కోడ్ ద్వారా చిన్న మొత్తంలో విరాళంగా ఇవ్వమని  అభ్యర్థించింది. ఒక్కొక్కరూ  ఒక్కో రూపాయి, లేదా రెండు రూపాయల చొప్పున దానం  చేస్తే, ఆ డబ్బులతో ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను కొనుక్కుంటానంటూ వేడుకుంటోంది. 

చదవండి: చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే

ఇక్కడ ఇంకో విషయం  ఏమిటంటే మూడు నెలల క్రితమే  తన తండ్రి తనకు ఐఫోన్ 16 కొని ఇచ్చాడనీ, కానీ తాను తాజా మోడల్ కోసం అడిగినప్పుడు,నిరాకరించాడని చెబుతోంది. అక్టోబర్ 21న తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో, కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కలర్‌ , డిజైన్‌ భలే నచ్చాయనీ, అది  తన “కలల ఫోన్”గా అభివర్ణించింది. ఈ విషయంలో తనకు సపోర్ట్‌గా చేసిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపింది.

 

దీంతో ఆన్‌లైన్‌లో చాలామంది ఆమెను తిట్టిపోస్తున్నారు. అడుక్కోవడానికి ఇదోమార్గం... పనికిమాలిన పని విమర్శించారు ఇలాంటి వారికి దానం చేస్తే పుణ్యం కంటే పాపమే వస్తుందని కొందరు, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఇదో చీప్‌ ట్రిక్‌ అంటూ మరికొందరు. మండిపడ్డారు. మహి సింగ్  బ్యూటీ క్వీన్ అనే ఐడీతో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)