Breaking News

పదేళ్లుగా ఆ అమ్మాయి అలానే మాంసం తినడంతో..!

Published on Thu, 09/26/2024 - 14:32

మాంసాహారులు చేపలు, కోడి, మటన్‌ వంటివి తినేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. అలాగే బాగా ఉడికించి తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి పదేళ్లుగా పచ్చి మాంసమే తిని భయానక వ్యాధిని బారిన పడింది. పచ్చి మాంసం తింటేనే ఆ వ్యాధి బారిన పడతారని వైద్యుల చెబుతున్నారు. ఇంతకీ ఆ యువతికి వచ్చిన వ్యాధేంటీ? పచ్చి మాంస వల్లనే వచ్చిందా..?

అసలేం జరిగిందంటే..చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ విలేజ్‌కు చెందిన యువతికి పచ్చి మాంసం తినే అలవాటు ఉంది. పదేళ్లుగా పంది మాంసాన్ని పచ్చిగానే తినేదట. దీని కారణంగా ఆమె అనారోగ్యం బారినపడి ఇబ్బందిపడింది. ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేని విధంగా ఉంది. చూడటానికి పైకి బాగానే ఉన్న ఏదో నిస్సత్తువ అవగాస్తున్నట్లుగా ఉండేది. దీంతో వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షలు నిర్వహించి సిస్టిసెర్కోసిస్‌ అనే వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు. 

అంతేగాదు వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ నిర్వహించి చూడగా.. ఆమె శరీరంలోని ఉన్న పరాన్నజీవుల సంఖ్యను చూసి కంగుతిన్నారు. ఆ యువతి శరీర భాగాలన్నింటిలో కళ్లు, కాళ్లు, చేతులు విడిచిపెట్టకుండా ఎక్కడపడితే అక్కడ టేప్‌వార్మ్‌ గుడ్లతో నిండి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. దీంతో ఆమె ఆహారపు శైలి గురించి ప్రశ్నించగా తనకు యుక్త వయసు నుంచి పచ్చి పంది మాంసం తినే అలవాటు ఉందని వెల్లడయ్యింది. 

ఇలా పచ్చిమాంసం తింటేనే భయానకమైన సిస్టిసెర్కోసిస్‌ అనే వ్యాధి బారినపడతారని అన్నారు వైద్యులు. ఈ వ్యాధి  శరీరంలోని ఏ భాగానికైనా వస్తుందని అన్నారు. దీని కారణంగా ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తం, మూర్చ, ఇన్ఫెక్షన్‌లు వంటి సమస్యల ఎదర్కొంటారని చెప్పారు. అంతేగాదు దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పరిస్థితి విషమిస్తే మరణం కూడా సంభవిస్తుందని చెప్పుకొచ్చారు. 

అలాకాకుండా శరీరంలోకి చేరిన ఈ పరాన్నజీవులు చనిపోతే ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు, తీవ్రమైన అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలా సిస్టిసెర్కోసిస్‌ బారినపడి ఏడాదికి ఐదు వేలకు పైగా మరణిస్తున్నట్లు వెల్లడించారు న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ మెంగ్ కియాంగ్ వైద్యులు.

(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్‌': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)