Breaking News

శిక్ష కాదు... శిక్షణ

Published on Mon, 11/24/2025 - 00:44

మానవజన్మ అనేక జన్మల కర్మఫల సంపద. ప్రతి జీవి తన కర్మానుసారమే ఈలోకంలో జన్మిస్తుంది. ఎదుగుతుంది. అనుభవిస్తుంది. మన కర్మల ప్రకారమే మన స్థితి, మన గతి నిర్ణయించబడతాయి. కర్మఫలానికి, ఆత్మకు అవినాభావ సంబంధం ఉంది. మనం చేసే ప్రతి ఆలోచన, మాట, చర్య విశ్వంలో ఒక ప్రకంపన సృష్టిస్తుంది. ఆ ప్రకంపన తిరిగి మనకే వస్తుంది. ఇది కర్మసూత్రం గాఢమైన సత్యం. కర్మానికి మూడు స్థితులు ఉంటాయి. 

అనేక జన్మలలో మనం చేసిన మొత్తం కర్మల నిల్వ సంచితకర్మ. ఈ జన్మలో ఫలించబోయే కర్మభాగం ప్రారబ్ధకర్మ. ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు, భవిష్యత్తులో ఫలితాలుగా వచ్చేవి ఆగామికర్మ. ఈ మూడు కలయికలతో మన జీవితం నడుస్తుంది. మనకు ఎదురయ్యే సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు ఇవన్నీ ఈ కర్మఫలాల ప్రతిఫలాలు. గతంలో చేసిన కర్మ ఈ రోజున ఫలిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మహాభారతంలో ధృతరాష్ట్రుడు సత్పురుషుల సలహాలు ఉన్నా అంధత్వం వదలలేకపోయాడు. ఆ దృష్టిహీనత కేవలం భౌతికం కాదు మానసికం. గత జన్మ కర్మఫలమే అతడిని అహంకారంలోకి నెట్టింది. చివరకు తన వంశ నాశనం చూసి అనుభవించాడు. ఇదే కర్మఫలానికి దృఢమైన ఉదాహరణ. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కానీ, దాన్ని ఆత్మజ్ఞానం, సహనం, భక్తి ద్వారా అధిగమించవచ్చు. శ్రీ కృష్ణుడు గీతలో ‘నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారముంది. 

ఫలితాన్ని నియంత్రించే శక్తి నీచేతిలో ఉండదు. కాబట్టి కర్మను నిష్కామ భావంతో చెయ్యాలి.’ అని చెప్పాడు. అదే నిష్కామ కర్మ. రామాయణంలో శ్రీరాముడు అనేక క్లేశాలను ఎదుర్కొన్నాడు. కానీ, ఎప్పుడూ ధర్మమార్గాన్ని వదలలేదు. ఆయన తన కర్మను కర్తవ్యభావంతో ఆచరించాడు. ధర్మానికి కట్టుబడి ఉండటంవల్లె చివరకు విజయాన్ని  పొందాడు. 

కష్టాలు మన శత్రువులు కాదు. అవి మన ఆత్మను పరీక్షించే ఉపాధ్యాయులు. మనిషి ఎదుర్కొనే ప్రతి దుఃఖం శిక్ష కాదు. అది శిక్షణ. కర్మఫలం మన ఆత్మను మలచే సాధనం. అగ్నిజ్వాలల్లో పసిడి కరిగి మెరుస్తున్నట్లుగా, కష్టాల్లో ఆత్మ పవిత్రమవుతుంది. కర్మఫలం నుండి విముక్తి  పొందాలంటే మనఃసాక్షిగా జీవించాలి. మనం కర్తలమని అనుకునే అహంకారాన్ని వదిలి ‘నేను కేవలం సాధనం మాత్రమే’ అనే భావంతో ఉండాలి. శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సమతాభావన అంటే సుఖదుఃఖాలను సమంగా స్వీకరించడం. ఆ స్థితిలో చేసిన కర్మ మనను బంధించదు. 

బలిచక్రవర్తి తన సంపదను, అధికారాన్ని విష్ణువుకు సమర్పించి కర్మబంధాలనుంచి విముక్తి  పొందాడు. హరిశ్చంద్రుడు సత్యంకోసం సర్వం త్యజించి ఆత్మశుద్ధిని  పొందాడు. పాండవులు కష్టాలను భరించి, ధర్మాన్ని విడువకపోవడంతో, సహనమే వారి విజయానికి మూలం అయ్యింది. మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. అదే మన కర్మ. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే దాన్ని భయంగా కాదు, అవకాశంగా చూస్తాం. కర్మను ధర్మంతో చెయ్యాలి. ఫలితాన్ని సమంగా స్వీకరించాలి. కర్మఫలం మనల్ని పరీక్షిస్తుంది. ఆధ్యాత్మికతే దానికి సమాధానం చెబుతుంది.

కర్మఫలం భయంకరమైనదే కావొచ్చు. కానీ, భక్తి, భగవన్నామస్మరణ కర్మ బంధాలను కూడా తెంచి విముక్తి కలిగిస్తుందనడానికి భాగవత పురాణంలో కనిపించే అజామిళుడి కథే ఉదాహరణ. 

– విరించి

 

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)