Breaking News

హైదరాబాద్‌లో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్‌

Published on Fri, 11/08/2024 - 17:31

సాక్షి,హైదరాబాద్‌ : మ‌న దేశంలో దాదాపు 25 శాతం మంది ప్ర‌జ‌లు వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వీళ్లలో చాలామందికి శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేకుండానే న‌యం చేయొచ్చ‌ని జాతీయ‌, అంత‌ర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్ర‌స్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుత‌మైన చికిత్స‌లు చేయొచ్చ‌ని వివ‌రించారు. 

న‌గ‌రంలోని అవిస్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో గ‌ల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫ‌రెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్ర‌వారం నిర్వ‌హించారు. దీనికి అవిస్ ఆస్ప‌త్రి వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ నిపుణుడు డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వ‌హించారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి 100 మంది వ‌ర‌కు వైద్య నిపుణులు దీనికి ప్ర‌త్యక్షంగా హాజ‌ర‌య్యారు. బ్రెజిల్ నుంచి కొంద‌రు నిపుణులు ఆన్‌లైన్‌లో హాజ‌రై త‌మ అభిప్రాయాలు, అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌ను శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేకుండా లేజ‌ర్ల ద్వారా, ఇత‌ర మార్గాల్లో నయం చేయ‌డం ఎలాగ‌న్న అంశంపై ఇందులో విస్తృతంగా చ‌ర్చించారు. అవిస్ ఆస్ప‌త్రిలో గ‌త ఎనిమిదేళ్లుగా ఇప్ప‌టికి దాదాపు 40 వేల మందికి పైగా రోగుల‌కు శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా న‌యం చేశామ‌ని, ఈ రంగంలో వ‌స్తున్న మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల అన్నారు.

అంత‌ర్జాతీయంగా పేరున్న‌ డాక్ట‌ర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్ట‌ర్ రాజేష్ వాసు, డాక్ట‌ర్ ఫెర్ర‌నాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యుల‌ర్, ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియాల‌జీ నిపుణులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రై.. అంత‌ర్జాతీయంగా ఈ రంగంలో వ‌స్తున్న ప‌లు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదుర‌వుతున్న స‌వాళ్ల గురించి చ‌ర్చించారు. వీరితో పాటు వాస్క్యుల‌ర్ స‌ర్జ‌రీ, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేద‌ని, అయితే కొన్నిసార్లు త‌ప్ప‌నిస‌రిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

వెరికోస్ వెయిన్స్ విష‌యంలో అద్భుత‌మైన ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటి వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం ద్వారా విజ్ఞాన స‌ముపార్జ‌న చేయాల‌ని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)