Breaking News

టాలెంట్‌ వదిలేసి బొట్టుపై ట్రోల్స్‌

Published on Tue, 08/05/2025 - 00:43

ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్‌ జనరల్‌ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్‌ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్‌ ఆఫీస్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్‌తో నిండిపోయింది ఎక్స్‌. 

మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్‌ జనరల్‌గా ఒక ఇండియన్‌ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్‌ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్‌ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్‌ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు  ఎక్స్‌లో కామెంట్లు గుప్పించారు.

 ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్‌కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్‌ డేవ్‌ యోస్ట్‌ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్‌ అమెరికన్‌ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్‌ జనరల్‌ హోదాకు అన్ని అర్హతలున్న పర్‌ఫెక్ట్‌ అభ్యర్థి. ఆ  బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్‌ చేశారు. 

మథుర శ్రీధరన్‌.. ఎమ్‌ఐటీ (మాసచ్యూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పోస్ట్‌గ్రాడ్యూయేట్‌. తర్వాత న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లాలో చేరి జ్యూరిస్‌ డాక్టర్‌ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్‌ జనరల్‌ పదవి వరించేలా చేసింది.            

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు