Breaking News

45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..!

Published on Thu, 07/11/2024 - 12:46

బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.  డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!

భారత సంతతికి చెందిన బిహేవియరల్‌ సైన్స్‌ సోల్యూషన్స్‌ కంపెనీ ఫైనల్‌ మైల్‌ కన్సల్టింగ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్‌ ప్రసాద్‌ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్‌ లాస్‌ జర్నింగ్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా నెటిజనల్‌తో షేర్‌ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్‌ లాస్‌ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్‌ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్,"  "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. 

అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్‌ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్‌ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్‌ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్‌. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్‌లో రెండు నెలలు పాటు షుగర్‌ తీసుకోకుండా ఉండటం. 

ఏడాదిపాటు వాకింగ్‌ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్‌ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్‌ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్‌ వెయిట్‌లాస్‌ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)