Breaking News

దివి నుండి భువికి దీపావళి

Published on Wed, 10/30/2024 - 00:22

దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్‌ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్‌. వారిని స్పేస్‌లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి  వచ్చే అవకాశాలు లేవు. 

సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.

‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్‌కు సునీతా విలియమ్స్‌ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)