Breaking News

అది మన సంస్కృతి

Published on Sat, 01/24/2026 - 05:55

ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేయడం, తిరిగి ఏమీ ఆశించక΄ోవడం అనే భారతీయ సంస్కృతిని జపాన్‌ వేదికగా చాటి చెప్పాడు ఓ భారతీయుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది. రోహన్‌ రానా అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి జపాన్‌లో మెట్రో ట్రైన్‌ని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుండగా.. ఓ వృద్ధుడైన జపనీస్‌ వ్యక్తి కిందపడి ఉండటాన్ని గమనించారు. ఆ వృద్ధుడికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. 

చుట్టూ చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ వృద్ధుని పట్టించుకోలేదు. కానీ రోహన్‌రానా, అతని స్నేహితుడు క్షణం కూడా ఆలోచించకుండా అతనికి సాయం చేయడానికి ముందుకెళ్లారు. ఆ వృద్ధుడికి చేయూతనిచ్చి కూర్చోబెట్టి, తమ వద్ద ఉన్న బ్యాండేజీని గాయంపై వేసి, అతనికి ధైర్యం చెప్పారు. కృతజ్ఞతగా ఆ వృద్ధుడు రోహన్‌కి కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ రోహన్‌ ఆ డబ్బును నిరాకరించాడు. అనంతరం రోహన్‌ ఆ విషయాన్ని చెబుతూ ఆ వృద్ధుడు ఇచ్చిన డబ్బుని చూడటం కూడా తనకు నచ్చలేదని, అది ఒక భారతీయుడిగా తన వ్యక్తిగత విలువలకు విరుద్ధమని భావోద్వేగానికి లోనయ్యాడు. సాటి మనిషిపై చూపిన జాలి, మానవత్వం భారతీయుల విలువలకు అద్దం పడుతోంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)