Breaking News

పప్పులతో పరేషాన్‌.. పెరిగిన కందిపప్పు ధరలు

Published on Tue, 08/29/2023 - 15:35

నిన్నామొన్నటి వరకు కూరగాయలు ధరలు ఆకాశాన్నంటగా సతమతమైన ప్రజలను ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్‌ చేస్తున్నాయి. కూరగాయల ధరలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకుంటుండగానే పప్పుల ధరలు అమాంతం పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది.

ప్రతీ ఇల్లు, హోటళ్లలో ప్రధానంగా వినియోగించే కంది పప్పు ధర దాదాపు రెట్టింపైంది. అంతేకాకుండా ఇతర పప్పుల ధరలు కూడా కిలోకు రూ.30 నుంచి రూ.40 మేర పెరిగాయి. జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసినా వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవటంతోనే పప్పుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కందిపప్పు రూ.170కి పైగానే...

కందిపప్పు ధర ఊహించని విధంగా పెరిగింది. పంట సీజన్‌ ఫిబ్రవరిలో రకం ఆధారంగా కేజీకి రూ.95 నుంచి రూ.105 వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.110, జూన్‌లో రూ.135 వరకు లభించిన కంది పప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.175 నుంచి రూ.185 పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోనైతే ఏకంగా రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంది పంట సాగు చేస్తారు. కంది పప్పులో అకోల, నాగపూర్‌ రకాలకు డిమాండ్‌ ఎక్కువ. దీంతో ఈ రకాల ధర ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఇక తాండూరు, దేశీయ రకం కంది పప్పుకు డిమాండ్‌ ఉండడంతో ధర నానాటికీ పెరుగుతోంది.

ఇతర పప్పులదీ అదే బాట

కంది పప్పుతో పాటు పెసర, మినప, బొబ్బెర వంటి పప్పుల ధరలు కూడా పెరిగాయి. కిలోకు రకం ఆధారంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరి గాయి. పెసర పప్పు ధర సీజన్‌లో గరిష్టంగా రూ.100 పలకగా, ఇప్పుడు రూ.120కి పైగానే విక్రయిస్తున్నారు. ఇక రూ.80 నుంచి రూ.90 పలికిన మినప పప్పు ధర రూ.120కి పైగానే పలుకుతోంది. అంతేకాక శనగ పప్పు ధర సీజన్‌లో రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఇప్పుడు వందకు చేరువైంది.

సాగు తగ్గి.. కాలం కలిసిరాక..

అపరాల పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడమే పప్పుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్వం అపరాల పంటలకు ప్రాధాన్యత ఉండేది. కానీ నీటి వనరులు పెరగటం, వాణిజ్య పంటలతో అధిక ఆదాయం ఉండటంతో రైతులు ఇటే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మూడేళ్ల క్రితం వరకు వానాకాలం పెసర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలకు పైగానే ఉండేది.

కందులు కూడా 5వేల నుంచి 6 వేల ఎకరాల వరకు, అంతర పంటగా మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పెసర సాగు 13,746 ఎకరాలకు పరిమితం కాగా కంది కేవలం 494 ఎకరాల్లో మాత్రమే వేశారు. కంది సాగు కాలం ఆరు నెలలు ఉండడంతో రైతులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అంతేకాక దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.

వినియోగానికి తగిన విధంగా పంట సాగు లేకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనే సాగు విస్తీర్ణం తగగా... పప్పుల ధరలు బాగా పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో అనుకూలించని వాతావరణంతో పప్పుల ధరలు భారీగా పెరగగా... ప్రభుత్వం రైతుబజార్లు, రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుటుందనేది వేచిచూడాలి.

డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకే...

ఏటా అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. రైతులు ఎక్కువమంది వాణిజ్య పంటల వైపునకు మళ్లారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గటంతో పాటు వాతావరణం అనుకూలించకపోవటంతో దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా పంట లేకపోవడంతో ధర పెరుగుతోంది. కంది పప్పుడు ధర కొద్ది నెలలుగా పెరుగుతున్నా, ఈనెల మరింత పెరిగింది.

– తేరాల ప్రవీణ్‌కుమార్‌,

వ్యాపారుల అసోసియేషన్‌ ప్రతినిధి, ఖమ్మం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)