Breaking News

జస్ట్‌ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!

Published on Fri, 10/10/2025 - 11:24

సొంతింటి  కల అనేది  చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. అంతేకాదు తమలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి  స్ఫూర్దిదాయకమైన స్టోరీ ఒకటి ఇపుడు నెట్టింట  విశేషంగా నిలుస్తోంది.పదండి ఆ వివరాలు తెలసుకుందాం.

భారతదేశంలో ఇల్లు కొనడం  దశాబ్దాల కష్టం దాగి ఉంటుంది.  అదీ ఒక మామూలు శ్రామికమహిళకు ఇంకా కష్టం. సూర‌త్‌కు చెందిన  ఒక  ఇంటి పని మనిషి కొత్త చరితను లిఖించింది  ఎన్నో అవమానాల్ని, అవహేళల్ని  తోసి రాజని సొంతింటి కలను నెరవేర్చుకుంది.సూరత్‌లో కేవలం రూ. 10 లక్షల రుణంతో రూ. 60 లక్షల 3BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని ఆమె  యజమాని నళిని ఉనగర్  ఈ స్టోరీని  ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో  ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని, చాలా  సాధారణంగా తనతో మాట్లాడుతూ  సూరత్‌లో తాను రూ.60 లక్షల అపార్ట్‌మెంట్ కొన్నానని  చెప్పిందని తెలిపింది. అంతే కాదు, ఆమె ఇప్పటికే రూ.4 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేసిందట ఇందుకోసం ఆమె తీసుకున్న  కేవలం  రూ.10 లక్షల రుణంతో ఇవన్నీ చేసుకుంది.. దీనికి నిజంగా షాకయ్యాను అంటూ నళిని  ట్వీట్‌ చేసింది. 

ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్‌ యాక్షన్‌!

దీనికి ఒక   యూజర్‌ స్పందిస్తూ'మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? ఆమె విజయానికి సంతోషించండి!'  అన్నదానికి రిప్లై  ఇస్తూ 'సంతోషంగా ఉన్నాను. కానీ  సమాజంలొ తరచుగా ఇంటి పనిలో ఉన్నవారు పేదోళ్లనే చులకన భావం ఉంటుందనీ, కానీ చాలామంది డబ్బును తెలివిగా  మేనేజ్‌ చేసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు  మరికొందరు కేఫ్‌లు, గాడ్జెట్‌లు ,  ట్రిప్‌లపై డబ్బు ఖర్చు చేస్తారని ఆమె  కామెంట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మ్యేజికో,మంత్రమో కాదు,  ఆమె ఆర్థిక నిర్వహణకు,   తెలివిగా పొదుపు చేసిన వైనానికి నిదర్శనమంటూ ప్రశంసించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)