Breaking News

పప్పీకోసం...బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌, పెళ్లి క్యాన్సిల్‌

Published on Mon, 11/18/2024 - 15:48

ఒక్క బుజ్జి  కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకోవడం  ఒకపుడు ఫ్యాషన్‌ .. కానీ ఇపుడు అదొక ఎమోషన్‌గా మారిపోయింది. పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒకరిగా ప్రేమించడం, పుట్టినరోజులు జరపడం, చనిపోతే ఆత్మీయులు చనిపోయినంతగా బాధపడటం, అంత్యక్రియలు జరిపించడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ కుక్క పిల్లకోసంఏడేళ్ల బంధాన్ని వదులుకున్న వైనాన్ని విన్నారా? అవును, పెళ్లి తర్వాత తన కుక్కను తనతో తీసుకురావాలనే కోరికను అత్తగారు నిరాకరించడంతో  బాయ్‌ ఫ్రెండ్‌కు బై బై చెప్పేసింది. పెళ్లిని క్యాన్సిల్‌  చేసుకుంది. 

ప్రియాంక అనే ఇంటర్నెట్ యూజర్‌ తన కథను ఇలా వివరించింది.  ఏడేళ్ల తరువాత  మా బంధం ముగిసిపోయింది. అయితే ఇది నా వల్లనో, నా బాయ్‌ ఫ్రెడ్‌ వల్లనో కాదు. కేవలం అతని తల్లి వల్ల. మధ్యలో తల్లులు ఎందుకు రావాలి..ఎందుకు? ఏడేళ్లంటే మాటలా?’’ అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.

అయితే, విషయం ఏమిటంటే ప్రియాంక, ఒక అబ్బాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పెద్దల సమక్షంలో  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు.  ఇరు కుటుంబాలుమాట్లాడుకున్నాయి. కానీ పెళ్లి తర్వాత తన వెంట కుక్కను కూడా తీసుకొస్తానని ప్రియాంక  చెప్పింది. అందుకు  ప్రియుడి తల్లి వ్యతిరేకించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు వద్దన్నాడు అతగాడు.  అయితే తన ఇంట్లో తల్లి అనారోగ్యం కారణంగా కుక్కను చూసుకోలేకపోతోంది.  బాధ్యతలను తానే ఎక్కువగా చూసుకుంటున్నాను.  పైగా అదిలేకుండా జీవించ లేను అని భావించింది ప్రియాంక. అయితే అత్తగారింట్లో ఇప్పటికే ఒక కుక్క ఉందని, రెండు కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక తన కుక్కనుఅత్తగారు వారించిందని తెలిపింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు కటీఫ్‌ చెప్పేసానని తెలిపింది.

అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.  పెంపుడు కుక్క  ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు  నిజంగా ఇది చాలా కష్టం. అయినా  సర్దుబాట్లు, త్యాగాలు తప్పవు అని ఒకరు నిట్టూర్చగా, అది అతని ప్రాధాన్యత, ఇది మీ ప్రాధాన్యత అని ఇంకో వినియోగదారు వ్యాఖ్యానించారు.  ఇది చిన్నపిల్ల ట్వీట్‌లా ఉంది ఇంకొకరు కమెంట్‌ చేశారు. అమ్మాయిల డిమాండ్లు అసాధారణంగా ఉంటాయి. అయినా, ఇది చాలా సున్నితమైన అంశం. ఆమె ఇప్పటికే  తల్లిని, కుక్కను విడిచిపెట్టి  అతని ఇంటికి వెళుతోంది. కానీ అతను మాత్రం తల్లిదండ్రులు, కుక్కతో కలిసి హ్యాపీగా అతని ఇంట్లోనే ఉంటాడు. ఆ అవకాశం అమ్మాయికి లేదు కదా? మరో యూజర్‌ అభిప్రాయం వ్యక్తం  చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)