Breaking News

పారాగ్లైడింగ్‌ చేస్తూ లైవ్‌ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!

Published on Sat, 08/30/2025 - 12:32

పారాగ్లైడింగ్‌ చేయడమే ఓ సాహస కృత్యం అనుకుంటే..అలా గాల్లో తేలుతూ..మ్యూజిక్‌ ప్లే చేయాలనుకోవడం అలాంటి ఇలాంటి డేరింగ్‌ కాదనే చెప్పాలి. అస్సలు ఆ ఆలోచనే వెన్నులో వణుకుపుట్టించేస్తుంది. పారాగ్లైడింగ్‌తో ఒక్కసారిగా గాల్లోకి రాగానే ఎంతటి ధైర్యవంతులైనా..ఒక క్షణం పాటు భయకంపితులు అవ్వడం సాధారణం. అలాంటిది అలా చేస్తూ..లైవ్‌ మ్యూజిక్‌ ఇవ్వాలనే కోరిక అంటే..ఇదేం డేరింగ్‌ ఫీట్‌ రా బాబు అనిపిస్తుంది కదా..అలాంటి సాహసానికే తెరతేసింది ఇక్కడొక మహిళ..!. ఆమె ఎవరంటే..

డీజే టీఆర్‌వైపీఎస్‌గా పిలిచే ఒక భారతీయ డీజే పారాగ్లైడింగ్‌ చేస్తూ..సంగీతం ప్లే చేసింది. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో మ్యూజిక్‌ సరంజామా అంతా సురక్షితంగా ప్యాకే చేసుకుని ఎనిమిది వేల అడుగుల ఎత్తుకి వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అక్కడ ఆమె లైవ్‌లో డీజే మ్యూజిక్‌ ప్లే చేస్తూ చూడొచ్చు. 

నైపుణ్యం కలిగిన పారాగ్లైడింగ్‌ ట్రైనర్‌ సైతం ఈ కొత్త అనుభవాన్ని ఉత్సాహంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. నిజం చెప్పాలంటే ఈ సాహస కృత్యంతో ప్రపంచంలోనే తొలి పారాగ్లైడింగ్‌ డీజే మహిళగా నిలిచింది. పారాగ్లైడింగ్‌ డీజే సెట్‌ను ఎలా రూపొందించారో కూడా వివరిస్తూ..అక్కడ అంత తీవ్రమైన గాలులు లేవని వెల్లడించిందామె. అయితే పరికరాలు కొంతసేపటికీ పనిచేయకపోవడంతో ఆ ప్రయత్నాన్ని వెంటనే నిలిపేయాల్సి వచ్చిందని వివరించారామె. 

ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అంతర్జాతీయ అంతరిక్షంలో ప్లే చేసిన డీజేగా పేర్కొన్నారు. అంతేగాదు మహిళలు అనుమతి కోసం వేచి ఉండరు. చరిత్ర సృష్టించడమే వారి ధ్యేయం అని వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?)

 

#

Tags : 1

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)