Breaking News

స్పేస్‌ ఫుడ్‌ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్‌

Published on Fri, 04/18/2025 - 14:30

అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్  విల్మోర్‌ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్‌ బెటర్‌ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్‌ తీసుకుని మరీ ప్యాక్‌ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.

వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్‌ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్‌ సెషన్‌ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్‌ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. 

ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్‌-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్‌ ఫుడ్‌ టెస్ట​ టెస్ట్‌ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్‌ సెషన్‌ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. 

ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్‌ నమునాలను ఆ సెషన్‌లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో  తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్‌ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్‌లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్‌ఎస్‌కి పంపుతారని అన్నారు.

ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..
ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్‌ తీసుకుంటారట.

ఇదిలా ఉండగా..ఈ మిషన్‌ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్‌4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.

కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్‌ ఆక్స్‌-4లో  శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట.  

 

(చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..)
 

#

Tags : 1

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)