2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
విమానం విండోపై గణేశుడి చిత్రం..! మండిపడుతున్న నెటిజన్లు
Published on Wed, 09/23/2026 - 17:32
సర్వత్ర గణేశుడి వేడుకలతో సందడిగా ఉంది. ఒకపక్క నిమజ్జనం వేడుకలు కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక కళాకారిణి విమానం విండోపై గీసిన గణేశ్ చిత్రపటం వివాదాస్పదంగా మారి నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది. మితాలి సలుంకే అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందుకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.
ఆ వీడియోలో విమానంలో ప్రయాణిస్తుండగా విండోపై చక్కగా చిత్రీకరిస్తున్న గణేశుడి చిత్రాన్ని పంచుకున్నారు. ‘ప్రయాణిస్తుండగా కొత్త కాన్వాస్ దొరికింది’ అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. అంతే నెటిజన్లు ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేయొచ్చా? అని మండిపడ్డాడరు. మరికొందరు విమానం కిటికీలపై పెయింటింగ్ వేయడం ఎందుకు భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తుందో వివరిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
దాంతో సదరు కళాకారిణి మితాలి తాను విండోపై నేరుగా చిత్రించలేదని ట్రాన్స్‌పరెంట్ పేపర్‌పైనే చిత్రీకరించినట్లు వివరణ ఇచ్చింది. అందుకు రుజువుగా పెయింటింగ్ వేసిన పారదర్శక కాగితం ఫోటోని కూడా పంచుకుందామె. అంతేగాదు మితాలి సలుంకే,చేతన్ అద్విర్కర్ ద్వయం లైవ్ ఇండియన్ పెయింటర్స్. 2018లో ప్రారంభించిన లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్‌కు మార్గదర్శకులు కూడా తామే అని పేర్కొంది.
ఇదీ చదవండి: కేబీసీ కంటెస్టెంట్ మాటలకు..భావోద్వేగానికి గురైన అమితాబ్
Tags : 1